2న ఢిల్లీలో బీసీల పోరు గర్జన జంతర్ మంతర్ వద్ద మహాధర్నా
నమస్తే భారత్ :-మరిపెడ ఏప్రిల్ రెండో తారీఖున ఢిల్లీలో జరిగుతున్నటువంటి బీసీల పోరుగర్జన సభకు మంగళ వారం నాడు మహబూబాబాద్ జిల్లా నుండి బీసీ నాయకులు బయలుదేరడం జరిగింది. ఈసందర్భంగా బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు గుండగాని వేణు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికలలో 42 శాతం రిజర్వేషన్ల బిల్లులను అసెంబ్లీలో మార్చి 17న ఆమోదించబడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించినటువంటి బిల్లును పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే విద్యా ,ఉద్యోగ రంగాలతోపాటు, స్థానిక సంస్థల్లో 42% శాతం రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలని కోరుతూ బీసీల పోరుగర్జన సభకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు, వివిధ కుల సంఘాల నాయకులు వివిధ రాజకీయ పార్టీల నాయకులతో జంతర్ మంతర్ దగ్గర పోరుగర్జన నిర్వహించడం జరుగుతుందని అన్నారు. కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో మీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి చేస్తామని 2023 సాధారణ ఎన్నికలలో హామీ ఇవ్వడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల మీద అభిమానం ఉంటే, రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పార్లమెంటు సమావేశాలలో బీసీ బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించి చట్టం తేవాలని కోరారు. ఢిల్లీకి ప్రయాణిస్తున్న వారిలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు తన్నీరు రాంప్రభూ, కొత్తకొండ భరత్ గుమ్మడిల్లి లింగమూర్తి, వంగరి బ్రహ్మం, కాసాని శ్యామ్ యాదవ్, ముద్దంగుల యాదగిరి, సంకరి కిరణ్, రమేష్, ప్రకాష్, , తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

