కేంద్రం కుట్రలను ప్రజలు తిప్పి కొట్టెరోజు వచ్చింది
రాజ్యాంగ సవరణ ప్రయత్నాల వల్ల రిజర్వేషన్లకు ముప్పు వాటిల్లుతుంది, కుబేరుల కొమ్ముకాసేందుకే రాజ్యాం గ సవరణ నాటకం - రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు జల్ పల్లి నరేందర్.
నమస్తే భారత్, రాజేంద్రనగర్, ఏప్రిల్ 20. కేంద్రం కుట్రలను ప్రజలు తిప్పుకొట్టే రోజు వచ్చిందని రాజ్యాంగ సవరణ ప్రయత్నాల వల్ల రిజర్వేషన్లకు ముప్పు వాటిలో ప్రమాదం ఉందని రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు జల్పల్లి నరేందర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మండల పరిధిలోని ఆదివారం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే నినాదంతో రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర ఎస్సి సెల్ ఉపాధ్యక్షులు జలపల్లి నరేందర్ తో కలసిశంషాబాద్ మండల అధ్యక్షుడు శేఖర్ యాదవ్ ఆధ్వర్యంలోశంషాబాద్ మండలంలో కాచారం గ్రామం నుండి రాయనగూడ, ననాజీపూర్ గ్రామం వరకు కాంగ్రెస్ నాయకులతో కలిసి పాదయాత్ర చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.బిజెపి కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ పేరిట చేస్తున్న ప్రయత్నాలు రిజర్వేషన్లకు ముప్పు తీసుకురావడమే లక్ష్యంగా కనిపిస్తున్నాయని, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఎంతో శ్రమకోర్చి రచించిన రాజ్యాంగం వల్లనే ఇప్పటికీ బడుగు బలహీన వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. పెద్ద పెద్ద కుబేరుల కాసేందుకే రాజ్యాంగ సవరణకు కేంద్రం ప్రయత్నిస్తోందని వీటిని తిప్పి కొట్టే బాధ్యత ప్రతి ఒక్క పౌరునిపై ఉందని పిలుపునిచ్చారు. ఇందుకోసం ఏఐసీసీ అగ్రనేత చేపట్టిన రాజ్యాంగ పరిరక్షణ యాత్రకు ప్రజలు, ముఖ్యంగా అనగారిన వర్గాలు మద్దతు ఇవ్వాలని కోరారు. కుబేరుల నుండి నల్లధనం వెలికి తీస్తామని హామీ ఇచ్చిన బిజెపి మాట నిలుపుకోలేదని, వారికి నల్లధనాన్ని వైట్ మనీ గా చేసుకునే ఛాన్స్ ఇచ్చారని చెప్పారు. అలాగే జన్ దన్ బ్యాంకు ఖాతాలల్లో డబ్బులు జమ చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి నయా పైసా వేయలేదని పేర్కొన్నారు. కులాలు, మతాల మధ్య విభేదాలు సృష్టించి పబ్బం గడుపుకోవడమే బిజెపి విధానమని చెప్పారు. కోట్లల్లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన నరేంద్ర మోడీ ఈ దిశగా కనీసం ఆలోచనలు కూడా చేయడం లేదని అన్నారు. గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉపాధి హామీ పథకాన్ని తీసుకువచ్చి ఎంతోమంది పేదల కడుపులు నింపుతున్నదని అన్నారు. రాష్ట్రంలో నిధుల కొరత ఉన్నప్పటికీ అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న ఘనత సీఎం రేవంత్ రెడ్డి కే దక్కుతుందన్నారు. స్వతంత్రం వచ్చినప్పటి నుండి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పేరుగాంచిన భారతదేశంలో రాజ్యాంగాన్ని మార్చేందుకు కేంద్రం కుట్రలు పన్నుతోందని విమర్శించారు. కేంద్రం కుట్రలను ప్రజలకు వివరించి చెప్పేందుకు వారిని చైతన్యవంతులుగా చేసేందుకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ గ్రామ గ్రామాన పాదయాత్ర చేపట్టాలని నిర్దేశించారని చెప్పారు.ఈ కార్యక్రమంలో చంద్రారెడ్డి, నిరటి రాజు ముదిరాజ్, మాజీ సర్పంచ్ లు దర్గా సత్తయ్య, మైలరం బిక్షపతి, జగన్నాథం ఇస్తరి, సింహ రెడ్డి, నానాజీపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామస్వామి, సుకుమార్ గారు, సుధాకర్ యాదవ్ , సులోచన , మండల్ ఉపాధ్యక్షులు బంగారం కుమార్, సలీం, బాబన్న, గణేష్, ఎస్సి సెల్ అధ్యక్షులు నందు, రాజు గౌడ్ జంగన్న ఉపసర్పంచ్ నర్సింహా, కాంగ్రెస్ నాయకులు పాండు, జగదీష్, యాదవ్, వినోద్, చింటూ, శివ, అభిషేక్, పృద్వి, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ యూఐ, నాయకులు మండల ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
