సేవాలాల్ మార్గంలో నడవాలి ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ నాయక్
శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవలు బంజారా బోగ్ బండారా కార్యక్రమాంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ డోర్నకల్ శాసనసభ్యులు రామచంద్రనాయక్
నమస్తే భారత్ :-మరిపెడ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ పరిధిలో సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ , ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘురాం రెడ్డి హాజరయ్యారు. మాంసం,మందును వదిలి సేవాలాల్ బాటలోనే నడవాలని సూచించారు.బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ అని బంజార నేతలు ఈ సందర్భంగా గుర్తు చేశారు. డోర్నకల్ నియోజకవర్గం ప్రజలకు సేవలాల్ ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.సమాజ ఐక్యమత్యాన్ని చాటుదాం- అభివృద్ధికై పాటుపడుదాం.సేవాలాల్ మహారాజ్ స్ఫూర్తితో – నవ సమ సమాజాన్ని సాపిద్దాం -సేవా అభివృద్ధికై పాటుపడుదాం ఎమ్మెల్యే అన్నారు.సమాజ ధర్మ పరిరక్షణ కోసం సేవాలాల్ మహారాజ్ కృషిని ఆదర్శగా తీసుకుందాం.సేవాలాల్ చూపించిన బాటలో ప్రయాణిద్దాం- బంజారా సంస్కృతి సాంప్రదాయాలని, భాషను కాపాడుకుందాం అని ఈ సందర్భంగా తెలియజేశారు.సేవాలాల్ మహారాజ్ ఆశయాలకై.సేవాఅంకితభావంతో-సేవా చేద్దాం.మన తండాల హక్కుల పరిరక్షణకై - మనమే కథానాయకులు అవుతాం.తండా పంచాయతీ ఎన్నికల్లో తండాలని ఏకిగ్రీయం చేసుకుందాం- అభివృద్ధికి పాటుపడదాం అన్నారు.ఈ కార్యక్రమంలో వివిధ గిరిజన సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

