కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వం ముస్లిం సోదరుల హక్కులను హరించే వక్స్ బోర్డు బిల్లును వ్యతిరేకిస్తూ సోమవారం మహబూబాద్ జిల్లా కేంద్రంలో ముస్లిం సోదరులు నిర్వహిస్తున్న శాంతియుత ర్యాలీకి తెలంగాణ గిరిజన సంఘం సంపూర్ణ మద్దతును ప్రకటించింది
నమస్తే భారత్ :-మహబూబాబాద్ : ప్రపంచంలోనే భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్నటువంటి గొప్ప పేరు పొందిన భారతదేశంలో మతతత్వం పేరిట హిందూ దేశంగా మార్చాలని కుట్రలో భాగంగానే ఈరోజు వర్క్స్ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది ఇటువంటి కుట్రలను యావత్ భారత దేశ ప్రజలందరూ ముక్తకంఠంతో వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే సోమవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నటువంటి ముస్లిం సోదరుల భారీ ర్యాలీ లో తెలంగాణ గిరిజన సంఘం మహబూబాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య హరినాయక్ పాల్గొని మాట్లాడుతూ హిందూ ముస్లిం భాయి భాయి గా ఉన్నటువంటి ఈ భారత దేశంలో బిజెపి మోడీ ప్రభుత్వం ప్రజల మధ్య కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి భారతదేశాన్ని నాశనం చేసే దిశగా బిజెపి ప్రభుత్వం కుట్రలు చేస్తా ఉంది ఇటువంటి కుట్రలను తెలంగాణ గిరిజన సంఘం వ్యతిరేకిస్తా ఉంది.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

