27 న మహబూబాబాద్ ఐఎంఏ బిల్డింగు లో జరగబోయే పూలే అంబేద్కర్ జన జాతర సభ ను జయప్రదం చేయాలి.
కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డేలా రామ్మూర్తి,మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సూర్ణపు సోమయ్య
నమస్తే భారత్ :-మహబూబాబాద్ : భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని అణిచివేత ఆధిపత్యం పై ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని ఏప్రిల్ 27 న ఉదయం 10:30 గంటలకు ఐఎంఏ హాల్ నందు జరుగు పూలే అంబేద్కర్ జన జాతర సభలు నిర్వహించటంతో పాటు కుల వివక్ష పై ప్రత్యక్ష ప్రతిఘటన ఉద్యమాలు చేపట్టాలని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డేల రామ్మూర్తి, సూర్ణపు సోమయ్య మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పిలుపునిచ్చారు.సోమవారం నాడు గుమ్మునూరు సెంటర్లో కేవీపీస్ జిల్లా కమిటీ అధ్యక్షులు చీపిరి యాకయ్య అధ్యక్షతన జరిగిన సభలో పాల్గొని పూలె అంబేద్కర్ జన జాతర సభ పోస్టర్, కరపత్రాలు ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతు కుల వివక్ష ఆదిపత్యానికి వ్యతిరేకంగా కెవిపిఎస్ గత కొన్ని సంవత్సరాలుగా పూలే అంబేద్కర్ జన జాతర సభలునిర్వహిస్తుందన్నారు. మను ధర్మశాస్త్రం పేరుతో వేల సంవత్సరాలుగా దేశంలో మెజారిటీ ప్రజలను అణిచివేశారని చెప్పారు. నేడు ఆ భావజాలంతో దేశాన్ని ఏలుతున్న మనువాద పాలకులు వారి విధానాలు హిందూ మతంలోని మెజారిటీ ప్రజలను అణిచివేయటానికి అవమానించటానికి ఉపయోగపడుతున్నాయన్నారు. ధరలు పెంచడం నిరుద్యోగాన్ని పెంచడం ఆర్థిక అసమానతలు పెంచడం వంటి దుష్ట విధానాలను ప్రజలకు అర్థం కాకుండా నిత్యం మతం మత్తులోముంచుతుందనివారు విమర్శించారు. దేశవ్యాప్తంగా లక్షలాది బ్యాక్ లాక్ పోస్టులు భర్తీ చేయకుండా దళిత గిరిజనుల ఉపాధి ఎలా మెరుగుపడుతుందన్నారు. దేశంలో దళితులపై 300 రెట్లు దౌర్జన్యాలు పెరిగాయన్నారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన నేతలు వారి మనువాద దుష్ట విధానాలతో దేశాన్ని పరిపాలిస్తు రాజ్యాంగాన్ని తొలగించాలని చూస్తున్నారని విమర్శించారు. పూలే అంబేద్కర్ ఆశయాలకు తిలోదకాలు ఇస్తూ దేశంలో క్యాపిటలిస్టుల ప్రయోజనాల కోసం పాటుపడుతున్నారని అన్నారు. జ్యోతిబాపూలే అంబేద్కర్ ఆశయాలను నేటి తరంలోకి విస్తృతంగా తీసుకెళ్లే క్రమంలో రాజ్యాంగాన్ని రిజర్వేషన్లను ప్రభుత్వ రంగ సంస్థలను సామాజిక న్యాయాన్ని సాధించడానికి పూలే- అంబేద్కర్ జన జాతర సభలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో కులవివక్ష అంటరానితనం ఎక్కడ ఉన్న ప్రతిఘటించి పోరాడుదామని అన్నారు. ప్రజలు పౌర సమాజం కుల వివక్షను పారద్రోలాలని జిల్లాలో కులవివక్షపై ప్రత్యక్షంగా ప్రతిఘటన చేపడుతామని చెప్పారు. 27 న 10:30గంటలకు ఐఎంఏ బిల్లింగ్ నందు లో జరిగే జన జాతరలో ప్రధాన వక్త . ప్రొఫెసర్ గడ్డం కృష్ణ కాకతీయ యూనివర్సిటీ మరియు వక్తలు ధర్మారపు పీరోజీ గణేష్ లెక్చరర్ పొలిటికల్ సైన్స్ మహబూబాబాద్ సాధుల శ్రీనివాస్ కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు.ఏర్పుల వీరస్వామి రిటైర్డ్ ప్రిన్సిపాల్ జి జె సి బయ్యారం సువర్ణపు సోమయ్య మాజీ వైస్ చైర్మన్ మున్సిపాలిటీ మహబూబాబాద్ దుడ్డేల రామ్మూర్తి కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గార్లు హాజర వుతున్నారు పాట మాట కార్యక్రమాలు, వుంటాయని అన్నారు. పెద్ద ఎత్తున ప్రజలు ప్రముఖులు కవులు కళాకారులూ మేధావులు మహిళలు పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు.ఈ పోస్టర్ కరపత్రల ఆవిష్కరణలో పాల్గొన్నవారు కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు చీపిరి యాకయ్య, సూర్ణపు రాజు, బేతమల్ల విజయలక్ష్మి, నూనె శ్రీనివాస్, మట్టి నరేష్, పాక నాగార్జున, దుడ్డేల యుగేందర్, వర్రీ మల్లయ్య, రాంబాబు, కాగితపు ఐలయ్య, చాగంటి ముత్తయ్య, మాదాసు శ్రీను,బట్టు సురేష్, తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

