మహబూబాబాద్ బాలికల ఆశ్రమ పాఠశాల హాస్టల్ వార్డెన్ అనితను సస్పెండ్ చేయాలి
ఆశ్రమ పాఠశాలలో పోలీసు కానిస్టేబుల్ ల ఇస్తారాజ్యాన్ని అరికట్టాలి లేనియెడల జిల్లా డిడి కార్యాలయాన్ని ముట్టడి చేస్తాం - బోడ రమేష్ నాయక్ ఎల్ హెచ్ పి ఎస్ జిల్లా అధ్యక్షులు మహబూబాబాద్ ,తేజావత్ వాసు నాయక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
నమస్తే భారత్ :-మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నెహ్రూ సెంటర్లో మహబూబాబాద్ జిల్లా కమిటీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు బోడ రమేష్ నాయక్ మాట్లాడుతు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్డీవో ఆఫీస్ వద్ద గల బాలికల ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న అమ్మాయిని కానిస్టేబుల్ పేరును వాడుకొని అమ్మాయిని హాస్టల్ నుండి బయటకు తీసుకెళ్లడంలో నిర్లక్ష్యం వహించిన హాస్టల్ వార్డెన్ అనిత ను 24 గంటల లోపల సస్పెండ్ చేయాలని మహబూబాబాద్ ఎల్ హెచ్ పి ఎస్ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. గతంలో కూడా గుర్తుతెలియని వ్యక్తులు హాస్టల్లో ప్రవేశించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఈ విషయాన్ని ఎల్ హెచ్ పి ఎస్ జిల్లా కమిటీ పిఓ ఏటూరునాగారం మరియు పిఓ భద్రాచలం గారి దృష్టికి తీసుకువెళ్లిన కూడా హాస్టల్ వార్డెన్ అనిత పై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. చర్యలు తీసుకోకపోగా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న వార్డెన్ అనితను రక్షించడానికి ప్రయత్నం చేశారు. గతంలో కూడా అదే వసతి గృహంలో పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఒక కానిస్టేబుల్ అన్ని తానై వార్డెన్గా వ్యవహరించి వసతి గృహానికి కోడిగుడ్లు, చికెన్, మటన్, స్నాక్స్ వంటి వస్తువులను తానే స్వయంగా హాస్టల్ కు అందించేవాడు. ఇకనైనా జిల్లా అధికారులు కళ్ళు తెరిచి, లంచాల మాయలో పడకుండా సదరు వార్డెన్ అనిత పై చర్యలు తీసుకొని 24 గంటల లోపల సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా వసతి గృహాలలో పోలీసు కానిస్టేబుల్ ల అరాచకాలను అరికట్టి వారిపై కూడా చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. లేనియెడల జిల్లా గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కేసముద్రం మండల అధ్యక్షుడు అజ్మీర బాలు నాయక్, సిరోలు మండల అధ్యక్షులు జైల్ సింగ్ నాయక్, మరిపెడ మండల అధ్యక్షులు సురేష్ నాయక్, ధరావత్ రవీందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

