గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులను చైతన్యం చేయవలసిన బాధ్యత అందరి మీద ఉన్నది.
డాక్టర్ చదలవాడ హరి బాబు కన్జ్యూమర్ కాన్ఫ్రైడేషన్ ఆఫ్ ఇండియా సీనియర్ ఉపాధ్యక్షులు
నమస్తే భారత్ షాద్ నగర్ ఏప్రిల్21:షాద్ నగర్ సోమవారం నాడు అగ్మార్క్ డిపార్ట్మెంట్ మరియు సిసిఐ తెలంగాణ స్టేట్ కార్యవర్గం సంయుక్తంగా నిర్వహించిన కల్తీలు- ఎలా కనుగొనాలి అనే అంశంపై జరిగిన అవగాహన సదస్సుకు కన్జ్యూమర్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ చదలవాడ హరిబాబు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగిస్తూ.., కలియుగం అనే కన్నా కల్తీయుగమనాలి అన్నారు. ఎందుకంటే పిల్లలు తాగే పాలదగ్గర్నుంచి, టీ పొడి ,కారంపొడి ,పసుపు పొడి వెల్లుల్లి,ఆల్లం తోచేసిన పేస్టు మరియు ఫ్రిజ్లలో కుళ్ళిన మటన్ ,చికెన్ల తోటి రుచికరముగా బిర్యానీలు చేసి వండి వడ్డిస్తున్న హోటల్స్, బార్ అండ్ రెస్టారెంట్ వారు ..బాగా కాగిన నూనెలో బజ్జీలు పునుగులు చేస్తున్న వ్యాపారస్తులు వారి చేసిన ఆహారం తిని అనారోగ్యంతో ఆసుపత్రుల్లో పాలవుతున్న వినియోగదారులును రక్షించవలసిన బాధ్యత ప్రతి వినియోగదారుల సంఘాల నాయకుల పై ఉన్నదని హరిబాబు అన్నారు. ఈ సభకు సిసిఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి భీమిరెడ్డి అధ్యక్షత వహించారు. హరిబాబు ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. అసత్య ప్రకటనలలో కనిపిస్తున్న సిని స్టార్స్ బ్రాండ్ అంబాసిడర్స్ను కూడా 2019 వినియోగదారుల చట్ట ప్రకారము ఐదు సంవత్సరముల కఠిన కారాగార శిక్ష మరియు ఐదు లక్షల రూపాయల వరకు జరిమానా కమిషన్ వారువిధించవచ్చని చట్టంలో పొందుపరచడం జరిగినదనీ మరియు బంగారంలో కేడియం బదులు ఇరీడియం అనే కెమికల్ పౌడర్ కలపటం వలన వాటితో తయారుచేసిన ఆభరణాలు ధరించిన మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని భీమిరెడ్డిఅన్నారు. సామాజికవేత్త డాక్టర్ కొమ్ము వెంక్కన్న బాబు ప్రసంగిస్తూ.. మనం ఉపయోగిస్తున్న వాటర్ క్యాన్ లోని వాటర్ మరియు బ్రాండెడ్ వాటర్ బాటిల్స్ లో మినరల్స్ లేవని వ్యక్తి బజార్లో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ఆర్వో వాటర్ ప్లాంట్స్ అన్నీ కూడా మనము యనలసిస్, వాటర్ కెమికల్ ఎనాలిసిస్ కు పంపిస్తే ల్యాబ్ వారు అన్ సేఫ్ అని రిపోర్ట్ ఇస్తున్నారు కనుక అలాంటి వాటర్ గనుక తగిన వారు ఆత్రైడ్స్అనే కీళ్ల నొప్పులకు మరియు ఊబకాయం వస్తుందని మున్సిపల్ అధికారులు సప్లై చేయుచున్న వాటర్ ను కాచి వడబోసుకొని త్రాగటం మంచిదని వెంకన్న బాబు అన్నారు సీసీఐ జనరల్ సెక్రటరీ సుప్రభ ప్రసంగిస్తూ సాయంత్రం పూట మనం తినే పానీపూరీలు లో వాడుతున్న వాటర్ మంచిది కాదని ఆ వాటర్ లో ఈకోలియా బ్యాక్టీరియా ఉంటుందని వాటిని తిన్నా వారు మరణించడం జరుగుతుంది అనికొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల పానీపూరీలు బ్యాన్ చేయడం జరిగినది అన్నారు కార్యక్రమంలో సీసీ తెలంగాణ రాష్ట్ర సెక్రటరీ ప్రవీణ ప్రసంగిస్తూ సిటీ నుండి గల్లీ వరకు కర్రీ పాయింట్ వారు వాడే టేస్టెడ్ సాల్ట్ ను అధిక మొత్తంలో వాడుతున్నందున ఆ వంట లు తిన్నా వినియోగదారులు కు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నదని నిపుణులు చెప్తున్నారు అన్నారు ఆగమార్క్ డిపార్ట్మెంట్ చీఫ్ కమిస్టు శ్రీమతి సుభాషిని మరియు జూనియర్ కెమిస్ట్ కుసుము కుమారి నెయ్యి, పాలు ,తేనె పదార్థాల్లో కల్తి ఎలా కనుగొనవచ్చు చూపించారు అలానే రంగు కలిపిన భటానీలు మిరియాల లోబొప్పాయి గింజలు కలిపిన వి పసుపు, కారం పొడిలలో వ్యాపారస్తులు ఎలా కల్తీ చేస్తున్నారు చిన్నచిన్న ప్రయోగాల ద్వారా చూపించడం జరిగినది ఈ కార్యక్రమంలో అయూబ్ ఖాన్,సువర్ణ ,మాధురి గోపాల నారాయణ ,సత్యనారాయణ రెడ్డి, మల్లికార్జున్ నాయక్ వివిధ అంశములమీద మాట్లాడినారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

