రోడ్డు ప్రమాదంలో మరణించిన నవీన్, కానిస్టేబుల్ కుటుంబానికి పోలీస్ డిపార్ట్మెంట్ భద్రత నుండి వచ్చిన 16 లక్షల రూపాయల చెక్కులను కుటుంబ సభ్యులకు అందజేసిన పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపీఎస్ మేడమ్ గారు
నమస్తే భారత్ : పోలీస్ కుటుంబాలకు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అండగా భద్రత స్కీమ్ విధినిర్వహణలో మృతిచెందిన పోలీసులకు డిపార్ట్మెంట్ ఎప్పుడు అండగా ఉంటుంది2024 నవంబర్ నెలలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నవీన్, కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అందవలసిన బెనిఫిట్స్ లో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ భద్రత నుండి వచ్చిన 16 లక్షలు చెక్కులను కుటుంబ సభ్యులకు అందజేసిన పోలీస్ కమిషనర్ మేడమ్ గారు. తదనంతరం వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితి తదితర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. వచ్చిన ప్రతి పైసను జాగ్రత్తగా పిల్లల పేరుపై ఫిక్స్ డిపాజిట్ చేయాలని సూచించారు.ఈ సందర్భంగా మేడం గారు మాట్లాడుతూ విధినిర్వహణలో మృతి చెందిన పోలీస్ కుటుంబ సభ్యులకు డిపార్ట్మెంట్ ఎప్పుడు అండగా ఉంటుందన్నారు.నవీన్ కుటుంబ సభ్యులకు రావలసిన మరికొన్ని బెనిఫిట్స్ త్వరలో అందజేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఓ యాదమ్మ, ఏ, సూపరిండెంట్ మహమ్మద్ ఫయాజుద్దీన్, రాష్ట్ర పోలీస్ సంఘం ఉపాధ్యక్షులు రవీందర్ రెడ్డి జూనియర్ అసిస్టెంట్ రవిరాజు, సీసీ నితిన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. కమిషనర్ కార్యాలయము నుండి జారీ చేయనైనది.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

