మంచినీళ్ళ సమస్య పరిష్కరించకుంటే ఉద్యమం
* పెండింగ్ లో ఉన్న క్రమబద్దికరణ పట్టాలపై ప్రభుత్వం అధికారులు స్పష్టత ఇవ్వాలి
* సిపిఎం లీడర్లు బాలరాజు, భూక్యా రమేష్
* సిపిఎం అధ్వర్యంలో ఒక్కరోజు దీక్ష చేపట్టిన బస్తి ప్రజలు
నమస్తే భారత్/భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో: కొత్తగూడెం పట్టణంలో హనుమాన్ బస్తీ బూడిద గడ్డ గాజులరాజమ్ బస్తి ప్రజలకు మంచినీళ్ల సమస్య తీవ్రతరం అవుతుందని అప్రకటిత కరెంటు కోతలు ఎక్కువ ఉన్నాయని క్రమబద్ధీకరణ పట్టాలు ఇవ్వాలని డ్రైనేజీ పూడికలు తీయాలని తదితర సమస్యలపై పరిష్కారం కోసం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో హనుమాన్ బస్తీ సెంటర్లో సోమవారం ఒక్కరోజు నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా బస్తీ నాయకులు గూగులోతు సక్రం అధ్యక్షతన జరిగిన సభలో సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి లిక్కి బాల్రాజు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు భూక్యా రమేష్ మాట్లాడుతూ బస్తిలలో సమస్యలు పరిష్కరించాలని ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందనే చందంగా కిన్నెరసాని నీళ్ళు 10 రోజులకు ఒకసారి వస్తుందని అప్రకటిత కరెంట్ కోత ఎక్కువగా ఉందని డ్రైనేజీ పూడికలు తీయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని తదితర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మూడు బస్తీలలో 76 జీవో ప్రకారం క్రమబద్ధీకరణ పట్టాలు ఇవ్వలేదని వారు పేర్కొన్నారు. ప్రజలకు ఎందుకు ఇవ్వడం లేదు అనేది కూడా సమాధానం చెప్పలేని స్థితిలో అధికారులు ఉన్నారని విమర్శించారు. ఇందిరమ్మ ఇండ్లు అవకతవకలు జరుగుతున్నాయని పారదర్శకత లోపించిందని ఇందిరమ్మ ఇండ్ల పేర్లను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. వితంతు వికలాంగులు వృద్ధాప్య పింఛన్లు దరఖాస్తు చేసుకున్న వారికి ఇవ్వడం లేదన్నారు. ఇస్తున్న పింఛన్లు కూడా చాలా ఆలస్యంగా ఇస్తున్నారని అలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే పేదలు ఎలా బ్రతుకుతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండ్ల స్థలాలు లేక ప్రజలు అద్దె ఇళ్లల్లో ఉంటూ చాలీచాలని కూలి బతుకులకు అనేక సమస్యలు ఎదురవుతున్నాయని ధరలు పెరుగుతున్న నేపథ్యంలో సామాన్య జీవితాలు దుర్భరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే అర్హత కలిగిన వారందరికీ ఇండ్లు ఇందిరమ్మ పథకం పింఛన్లు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. క్రమబద్ధీకరణ పట్టాల వెబ్సైట్ ఓపెన్ చేసి పెండింగ్లో ఉన్న సమస్య పరిష్కరించాలని కోరారు. బస్తీలో ఉన్న స్థానిక సమస్యలు పరిష్కరించకపోతే పోరాటాలను తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు సూరం ఐలయ్య, భూక్యా బాబు, ఎన్ ఎస్ రాజు, గిరి, విజయ్ మోహన్, రాంబాబు, రాము
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
