మహబూబాబాద్ బాలికల ఆశ్రమ పాఠశాల హాస్టల్ వార్డెన్ అనితను సస్పెండ్ చేయాలి
మరిపెడ గిరిజన గిరిజన సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలి
గిరిజన సంక్షేమ శాఖలో ఉద్యోగాల డిప్యూటేషన్లను రద్దు చేయాలి
ఐటీడీఏ పీవో ను కోరిన బోడ రమేష్ నాయక్ , ఎల్ హెచ్ పి ఎస్ జిల్లా అధ్యక్షులు
మహబూబాబాద్ తేజావత్ వాసు నాయక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
నమస్తే భారత్ :-మరిపెడ : సోమవారం ఏటూరు నాగారం ఐటిడిఏ పిఓ కార్యాలయంలో ప్రాజెక్టు అధికారి చిత్ర మిశ్రా ను కలిసి మహబూబాబాద్ లో గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహాలలో మరియు గురుకుల పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులపై జరుగుతున్న దాడులపై, అవినీతి అక్రమాలపై పి ఓ కి వినతి పత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బోడ రమేష్ నాయక్ మాట్లాడుతు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్డీవో ఆఫీస్ వద్ద గల బాలికల ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న అమ్మాయిని కానిస్టేబుల్ పేరును వాడుకొని అమ్మాయిని హాస్టల్ నుండి బయటకు తీసుకెళ్లడంలో నిర్లక్ష్యం వహించిన హాస్టల్ వార్డెన్ అనిత ను సస్పెండ్ చేయాలని అదేవిధంగా గత మూడు రోజుల క్రితం మరిపెడ మండలంలోని గిరిజన సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థి కార్తీక్ హాస్టల్లో పురుగుల అన్నం పెడుతున్నందున ఆ పురుగుల అన్నం తినక బయట నుండి తెచ్చుకున్న అన్నాన్ని తినడంతో పాఠశాల ప్రిన్సిపల్ ఆ విద్యార్థి పై దాడి చేశారు. ఆ భయంతో ఆ విద్యార్థి పురుగుల మందు తీసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఈ విధంగా అవినీతి అక్రమాలకు పాల్పడుతు, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న హాస్టల్ వార్డెన్, ప్రిన్సిపల్ లను వెంటనే సస్పెండ్ చేయాలని కోరారు. గతంలో కూడా మహబూబాబాద్ బాలికల వసతి గృహంలో గుర్తుతెలియని వ్యక్తులు హాస్టల్లో ప్రవేశించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఈ విషయాన్ని ఎల్ హెచ్ పి ఎస్ జిల్లా కమిటీ పిఓ ఏటూరునాగారం మరియు పిఓ భద్రాచలం దృష్టికి తీసుకువెళ్లిన విషయాన్ని కూడా పి ఓ కి మరొక్కసారి గుర్తు చేశారు. గతంలో కూడా అదే వసతి గృహంలో పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఒక కానిస్టేబుల్ అన్ని తానై వార్డెన్గా వ్యవహరించి వసతి గృహానికి కోడిగుడ్లు, చికెన్, మటన్, స్నాక్స్ వంటి వస్తువులను తానే స్వయంగా హాస్టల్ కు అందించేవాడు. ఇకనైనా పి ఓ స్పందించి సదరు వార్డెన్ అనిత పై మరియు మరిపెడ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ లను సస్పెండ్ చేయాలని కోరారు. అదేవిధంగా మహబూబాబాద్ జిల్లా గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో మరియు వసతి గృహాలలో ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న ఉద్యోగుల యొక్క డిప్యూటేషన్లను వెంటనే రద్దు చేయాలని కోరారు. ఈ విషయంలో పిఓ స్పందించి వెంటనే విచారణ చేపట్టి బాధ్యులైన సదరు ఉద్యోగస్తులపై చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు భూక్య బాలాజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

