పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
నమస్తే భారత్ /మద్దూరు, (ఏప్రిల్ 20) : కొత్తపల్లి మండలంలోని నిడ్జింత జిల్లా పరిషత్ పాఠశాలలో ఆదివారం 2011 -2012 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఆరు నుంచి పదో తరగతి వరకు చదివిన విద్యార్థులు 14 ఏళ్ల తర్వాత మళ్ళీ తాము చదువుకున్న పాఠశాలలో కలుసుకుని ఒకరికొకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు . తాము చదివిన పాఠశాల, పరిసరాలను చూసి భావోద్వేగానికి గురయ్యారు. నాడు గురువులు నేర్పిన క్రమశిక్షణ, చదువుతో ఈరోజు వివిధ స్థాయిల్లో ఉన్నామని తెలిపారు. ఈ సదర్భంగా తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించారు. అదేవిధంగా తమ మిత్రుడు రామక్రిష్ణ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళ్ళు అర్పించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
