క్రీడలతోనే మానసిక వికాసానికి దోహదం
తొర్రూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ తిరుపతిరెడ్డి
నమస్తే భారత్ :-తొర్రూరు ; క్రీడలు మనో వికాసానికి దోహదం చేసి శారీరక దృఢత్వానికి తోడ్పడుతాయని తొర్రూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అనుమాండ్ల తిరుపతి రెడ్డి అన్నారు. డివిజన్ కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో గత రెండు రోజులుగా కీ.శే అనుమాండ్ల మాధవ రెడ్డి జ్ఞాపకార్థం వారి మనవడైన అనుమాండ్ల తిరుపతి రెడ్డి ఆర్థిక సహకారంతో నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి ఆహ్వానిత వాలీబాల్ క్రీడోత్సవాల బహుమతి ప్రధానోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై బహుమతులను అందజేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడలు స్నేహాన్ని పెంపొందిస్తాయని, శారీరక మనో వికాసాన్ని కలిగిస్తాయని, విద్యార్థులందరూ కూడా క్రీడల పైన దృష్టి పెట్టాలని అన్నారు. ప్రతి ఒక్కరూ క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ క్రీడలను పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ఝాన్సీ రెడ్డిలు ప్రారంభించినట్లు తెలిపారు.ఎంప్లాయిస్ వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు గొడిశాల నగేష్ అధ్యక్షతన ముగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. తిరుపతి రెడ్డి చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ప్రథమ బహుమతిని రఘునాథపల్లి, ద్వితీయ మేడారం తృతీయ కొత్తగూడ,చతుర్ద బహుమతిని తాడ్వాయి క్రీడాకారులు గెలుచుకున్నారు.ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రెటరీ వాసిరెడ్డి ప్రవీణ్ రెడ్డి,సూరం ఉపేందర్ రెడ్డి, కొండం జనార్దన్, ఎంఈఓ మహంకాళి బుచ్చయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జెల్ల లక్ష్మీనారాయణ,వాలీబాల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మర్కాల ఆది రెడ్డి, నరెడ్ల శ్రీధర్,ఎంప్లాయిస్ వాలీబాల్ అసోసియేషన్ ప్రతినిధులు దేవులపల్లి శంకర్, కారంపూడి సురేష్,రామచేంద్రం, నవీన్, సతీష్ యాకయ్య తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
