ఉపాధి పని ప్రదేశాలలో కనీస సౌకర్యాలు మెరుగుపరచాలి
కేంద్ర బడ్జెట్ లో నిధులు పెంచాలి
పెండింగ్ లో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ ల వేతనాలు వెంటనే చెల్లించాలి
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బాణాల రాజన్న
నమస్తే భారత్ :-మరిపెడ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పని ప్రదేశాలలో కనీస సౌకర్యాలు మెరుగుపరిచి ఉపాధి కూలీలను ఆదుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మహబూబాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు బాణాల రాజన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిల్లంచర్ల గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించి, సంఘ సభ్యత్వం చేర్పించి, అనంతరం రాజన్న మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకుందాం జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఉపాధికి నిధులు పెంచకుండా రెండున్నర లక్షలు ఉపాధి అవసరం ఉండగా బడ్జెట్లో 86000 కేటాయించి ఉపాధిని నిర్వీర్యం చేసే చర్యలు చేపడుతుందని రాజయ్య అన్నారు పని ప్రదేశాలలో కూలీలకు నీడకు చెంటు కూలీలకు నీడకు టెంటు త్రాగడానికి మంచినీరు మెడికల్ కిట్టు చిన్నపిల్లల సంరక్షణకు ఆయాను ఉంచటం వంటి సౌకర్యాలు కల్పించాలి ఇలాంటి సౌకర్యాలు కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వై పల్యం చెందాయని వారన్నారు ప్రభుత్వం పని చూపకపోతే చటపకారం నిరుద్యోగ భృతి ఇవ్వాలి పనిచేసిన కూలీలకు వారం వారం డబ్బులు చెల్లించాలి మెట్ల వ్యవస్థను పునరుద్దించాలి కేరళ వాపక్ష ప్రభుత్వం మోడలుగా పట్టణ ప్రాంత ప్రజలకు ఉపాధి పని వర్తింపజేయాలని పని దినాలు 150 రోజులకు పెంచాలని ఫీల్డ్ అసిస్టెంట్లకు వేతనాలు పెంచి నెలవారీగా వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో చిన్నబోయిన వెంకన్న, పిట్టల ధనంజి, సురేష్ అలవాల, నరేష్,చెన్నబోయిన ముత్తయ్య,లక్ష్మయ్య,పులి ఎంకన్న, భద్రయ్య, బండి మల్లయ్య,గాడిదల మాధవి,కేతమ్మ, బంధు సుగుణమ్మ, తదితరులు పాల్గొన్నారు
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
