ఆకాల వర్షం అన్నదాతకు తీరని నష్టం
-నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల డిమాండ్
-తలకొండపల్లి,వెల్జాల్, జూలపల్లి, అంతారం, బదనాపూర్,చంద్రదన,రాంపూర్ గ్రామాలలో తీవ్ర నష్టం
నమస్తే భారత్ ఎప్రిల్ 20. తలకొండపల్లి : తలకొండపల్లి మండల కేంద్రంలోని వివిధ గ్రామాలలో గాలి వాన బీభత్సంతో తీవ్రంగా నష్టపోయిన రైతులు.భారీ వర్షాల ప్రభావంతో నష్టపోయిన రైతులు - మామిడి, ధాన్యం, మొక్కజొన్న వంటి పంటలు పూర్తిగా దెబ్బతిని లక్షలాది రూపాయల నష్టం, ప్రభుత్వం స్పందించి నష్టపరిహారాన్ని చెల్లించాలని విజ్ఞప్తి.అకాల వర్షాలతో తీవ్ర నష్టం - ప్రభుత్వం ఆదుకోవాలంటున్న అన్నదాతలు....భారీ వర్షాల ప్రభావంతో నష్టపోయిన రైతులు- మామిడి, వరి ధాన్యం, మొక్కజొన్న వంటి పంటలు పూర్తిగా దెబ్బతిని లక్షలాది రూపాయల నష్టం, ప్రభుత్వం స్పందించి పరిహారాన్ని కల్పించాలని విజ్ఞప్తి.అకాల వర్షాలతో రైతన్నలకు తీవ్ర నష్టం వాటిల్లింది. తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామంలో 50,000/- రూపాయలు ఖర్చుపెట్టి ఆవుల కోసం షెడ్డు వేసిన బొడ్డుపల్లి రవి అనే రైతు ఆవుల షెడ్డు గాలివాన బీభత్వానికి పూర్తిగా కూలిపోవడం జరిగింది. ఆ సమయంలో ఆవుల షెడ్డు కింద ఆవు దూడ ఉండడం ఆవు దూడ పై ఒక్కసారిగా ఆవుల షెడ్ ఆవు దూడపై పడడంతో తీవ్ర గాయాలతో ఆ ఆవుధుడను రైతు బయటకు తీశాడు.గాలి వాన బీభత్సానికి కరెంట్ స్తంభాలు భారీ వృక్షాలు నీలమట్టమయ్యాయి. మరో రైతు 4 ఎకరాల మామిడి తోట మామిడి కాయలు కోసే సమయానికి గాలివాన బీభత్సానికి బొడ్డుపల్లి శ్రీను రైతు యొక్క మామిడి తోట గాలివాన బీభత్సానికి మామిడికాయలు నేల జారడం జరిగింది.గడ్డం వెంకటయ్య రైతు యొక్క ఆవుల షెడ్డు గాలివాన రావడంతో కూలిపోవడం జరిగింది.వివిధ గ్రామాలలో అధికంగా రైతులు నష్టపోయారు.మామిడి, ధాన్యం,మొక్కజొన్న, పంటలు పూర్తిగా దెబ్బతిని, లక్షలాది రూపాయల నష్టం వాటిల్లింది.అకాల వర్షాలకు నష్టపోయిన రైతన్నలు: గాలి వాన బీభత్సం వల్ల మామిడి పండ్లు నేలరాలి పోయాయని రైతులు వాపోయారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు. వడగండ్ల వాన,ఈదురు గాలులకు మామిడి,మొక్కజొన్న, వరి పంటలు పూర్తిగా నష్టపోవడం జరిగింది. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
