మత్తు పదార్థాల నిర్మూలనకై పోలీస్ జాగిలంతో ఆకస్మిక తనిఖీలు
కిరాణా షాపులు, పంట పొలాలలో తనిఖీలు , మత్తు పదార్థాలు వినియోగించిన, అమ్మిన రవాణా చేసిన కూడా నేరమే
నమస్తే భారత్ / మద్దూరు, కోస్గి ( ఏప్రిల్ 21) :సోమవారం రోజు కోస్గి పోలీస్ స్టేషన్ పరిధిలో నార్కోటిక్స్ స్నైపర్ పోలీసు జాగిలంతో పలు ప్రదేశాలలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించినట్టు డిఎస్పీ నల్లపు లింగయ్య తెలిపారు. గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల నిర్మూలన గురించి అక్రమ రవాణా జరగకుండా కోస్గి పోలీస్ స్టేషన్ పరిధిలో పకడ్బందీగా తనిఖీలు నిర్వహించామని , ముఖ్యంగా కిరాణా షాపులలో, అనుమానంగా ఉన్న పంట పొలాల్లో, పాన్ షాప్ లలో తనిఖీలు నిర్వహించడం జరిగిందని అన్నారు. ఎవరైనా గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు వినియోగిస్తున్న, అమ్మిన లేదా రవాణా చేసిన, సరఫరా చేసిన వెంటనే డయల్ 100 కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని , ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ ఆంజనేయులు, నార్కోటిక్స్ స్నైపర్ డాగ్ విక్కి , డాగ్ హ్యాండ్లర్ పరమేష్ పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

