ఉపాధి కూలీల పెండింగ్ బిల్స్ వెంటనే విడుదల చేయాలి జిల్లేడు చౌదరి కూడా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్ధుల జంగయ్య డిమాండ్
నమస్తే భారత్,షాద్ నగర్ ఏప్రిల్21:జిల్లేడు చౌదరిగూడ మండల కేంద్రం ఆర్య సమాజ్ ఆవరణలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లేడు చౌదరిగుడా మండల మహాసభ వి భీమయ్య అధ్యక్షతన జరిగింది ఈ మహాసభ ప్రారంభ ఉపన్యాసం చేసిన తెలంగాణ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిబుద్ధుల జంగయ్య మాట్లాడుతూ నెల 15 రోజులుగా ఉపాధి కూలీలు పనులు చేస్తున్నారు కానీ ఇంతవరకు వారికి పెసిప్పులు ఇవ్వలేదు కూలీ డబ్బులు రాలేదని వాళ్ళు ఏం తిని పనిచేస్తారో ప్రభుత్వం అధికారులు సమాధానం చెప్పాలని ఆయన అడిగారు ఎర్ర ఎండలో పనులు చేస్తుంటే ప్రభుత్వానికి అధికారులకు కనికరం లేకుండా వ్యవహరించడం సరైనది కాదు అని ఆయన మండిపడ్డారు ఎమ్మెల్యేలకు ఎంపీలకు లక్షలాది రూపాయలు వేతనాలు వస్తున్నాయి అట్టడుగు పేదలైనకూలీలు ఓట్లు వేసినందుకు మీరు ప్రభుత్వాలు ఏర్పాటు చేయగలిగారు మీరు జీతాలు తీసుకున్న గలుగుతున్నారు కానీ ఓట్లేసిన కూలీలనే మోసం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు దేశవ్యాప్తంగా 100 కోట్ల మంది ఉపాధి కూలీలకు రెండు లక్షల 86 వేల కోట్లు అవసరం ఉంటే ఉట్టి 86 వేల కోట్లు మాత్రం కేటాయించి చేతులు దులుపుకుంది నరేంద్ర మోడీ బిజెపి ప్రభుత్వం అని విమర్శించారు పనుల దగ్గర కనీస వస్తులైన మంచి నీళ్లు నీడ కోసం టెంటు వైద్య కిట్టు పారా గడ్డపార గంపలు లాంటివి ఎలాంటివి ఏర్పాటు చేయకుండా ఉపాధి కూలీలతో వెట్టి చాకిరి చేయిస్తున్నారు అని తియ్యబట్టారు ఉపాధి కూలీలకు 200 వందల రోజులు పనులు కల్పించాలని కొలతలతో సంబంధం లేకుండా 700 వందల రూపాయలు కూలివ్వాలి రవాణా సౌకర్యం కల్పించాలని అలాగే 8 వారాలుగా పెండింగ్లో ఉన్న బిల్స్ అన్ని విడుదల చేసి వెంటనే వారి అకౌంట్లో వెయ్యాలని ఆయన డిమాండ్ చేశారు ఫీల్డ్ అసిస్టెంట్ల యూనియన్ జిల్లా నాయకులు జిల్లాల వెంకటేష్ మాట్లాడుతూ ఫీల్డ్ అసిస్టెంట్లకు నాలుగు నెలల నుంచి జీతాలు రావడం లేదని సీనియర్ మేట్లను ఫీల్డ్ అసిస్టెంట్లుగా గుర్తించాలని వేతనాలు ఇవ్వాలని హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని
టిఎడిఎ ఇవ్వాలి ఫీల్డ్ అసిస్టెంట్లకు కనీస వేతనం 26000 ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది గౌరవాధ్యక్షులుగా వి భీమయ్య అధ్యక్షులుగా కే లింగం ఉపాధ్యక్షులుగా కే రామచెంద్రి యాదమ్మ కార్యదర్శిగా ఎం కృష్ణ
సహాయ కార్యదర్శిగా కృష్ణయ్య సురేష్ కోశాధికారిగా పి బాలు కమిటీ సభ్యులుగా మరో ఏడు మందిని ఎన్నుకున్నారు మహాసభ అనంతరం సమస్యలపై ఎంపీడీవో కి విన్నతి పత్రం ఇవ్వడం జరిగింది ఎంపీడీవో మాట్లాడుతూ మీరిచ్చిన డిమాండ్లన్నీ కూడా ఉపాధి హామీ పీడీకి రాసి పరిష్కారమయ్యే విధంగా చూస్తానని హామీ ఇవ్వడం జరిగింది అని తెలిపారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు బాల్ రాజ్ జంగయ్య నర్సమ్మ సునీత గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు వీరేశం పాపయ్య వివిధ గ్రామాల ఉపాధి కూలీలు తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

