నిర్మల్ పోలీస్.. మీ పోలీస్..

సమర్థవంతమైన పోలీసు వ్యవస్థలో పనిచేస్తున్నాం ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో ఉండాలి...  గ్రామాలను సందర్శించి పూర్తి స్థాయిలో నిఘా ఉంచాలి

నిర్మల్ పోలీస్.. మీ పోలీస్..

మారకద్రవ్యాలతో నిర్వీర్యమవుతున్న యువతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది
 పోలీసు అధికారులతో  సమీక్ష  నిర్వహించిన  జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపిఎస్

తేదీ, ఏప్రిల్ 21, 2025
నమస్తే భరత్ : సోమవారం నిర్మల్ జిల్లా పోలీస్ ముఖ్య కార్యాలయంలో జిల్లా పోలీస్ అధికారులతో నిర్మల్ జిల్లా ఎస్పీ డా .జి.జానకి షర్మిల ఐపిఎస్ మొట్ట నేర సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఈ  సమావేశంలో ఎస్పీ డా. జానకి షర్మిల మాట్లాడుతూ... ప్రతీ గ్రామాన్ని పోలీసు అధికారులు, గ్రామ పోలీసు అధికారులు  సందర్శించి గ్రామాలలో పూర్తి స్ధాయిలో నిఘా ఉంచి ఎప్పటికప్పుడు నేరాలకు సంబంధించిన సమాచారం ముందస్తుగా తెలుసుకోవాలని అన్నారు.ఏ.ఎస్పీ, సీఐలు తప్పకుండా తమ పరిధిలో ఉన్న స్టేషన్లను  గ్రామాలను సందర్శించి, వారి పనితీరు సమీక్షించాలని , తమ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకుని వాటి ప్రకారం నేర నియంత్రణకు కృషి చేయాలని సూచించారు. పోలీస్టేషన్ పరిధిలో ఇరవై నాలుగు గంటల పెట్రోలింగ్ గస్తీ ఉండాలని అన్నారు. రోజువారీ పెట్రోలింగ్ ను మరింత సమర్ధవంతంగా నిర్వహించాలని, వీలైనంత తక్కువ సమయంలో బాధితుల వద్దకు చేరుకోవాలని సూచించారు.యువత మారకద్రవ్యాలు, డ్రగ్స్,గంజాయి  ఇతర మత్తు పదార్థాల కారణంగా యువత భవిష్యత్తు నిర్వీర్యం అవుతున్నదని, దీనివల్ల దేశ అభివృద్ధి, భవిష్యత్తు దెబ్బతినే ప్రమాదం ఉన్నదని చెప్పారు. యువత గంజాయి, మత్తు పదార్ధాలకు బానిసలుగా మారి విచక్షణ కోల్పోయి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల యువత సైతం గంజాయి సేవించే స్థాయికి గంజాయి విక్రయాలు పెరిగాయని అందువల్ల క్షేత్రస్థాయి నుండి పోలీసు అధికారులు సమాచార వ్యవస్థను మరింత పటిష్ఠం చేసి అవగాహన  కల్పించాలని అన్నారు.  ప్రజలకు పోలీస్ పై ఉన్న నమ్మకాన్ని మరింత పెంచేలా పోలీస్ విధులు ఉండాలనీ, వచ్చిన పిర్యాదు పై చట్ట ప్రకారం చర్యలు చేపట్టాలని, ఆయా కేసులలో నిందితులకు పడే శిక్షల శాతం మరింత పెరిగేలా ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాలని , ట్రయాల్స్ సమయంలో ఉన్నతాధికారులు మానిటర్ చెయ్యాలని, అలాగే టెక్నాలజీ వినియోగం ను. రైటర్స్ , CCTNS , రిసెప్షన్, CDOs కు వర్టికల్ వారిగా నైపుణ్య శిక్షణ ఇవ్వాలని అన్నారు. ఆర్గనైజ్డ్ క్రైమ్, ప్రాపర్టీ నేరాలు జరుగకుండ ముందస్తు సమాచారం తోనే నియంత్రించాలని, రాత్రి గస్తీ ను మరింత పెంచాలని అవసరమైతే పట్టణాలలో సైక్లింగ్ చేస్తూ గస్తీ నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలు జరిగే హాట్ స్పాట్స్ ను గుర్తించి ఆ ప్రాంతాల్లో తగిన మార్పులు చేర్పులు చేపట్టాలని, ప్రతీ ఫ్యాటల్ రోడ్డు ప్రమాదంను SHO స్వయంగా సమీక్షించాలని అన్నారు, రోజూ ఎక్కువ మొత్తంలో తనిఖీలు,  డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు నమోదు చెయ్యాలని అన్నారు. జాతీయ రహదారి జంక్షన్స్ దగ్గర, జిల్లా లోని ప్రతి గ్రామం, మున్సిపాలిటీ వార్డు లలో సీసీ కెమెరాలు ఉండేలా చూడాలని, ఏర్పాటు చేసిన చోట పని చెయ్యని కెమెరాలను పునరుద్ధరించడం లేదు మార్పు చెయ్యడం చెయ్యాలని అన్నారు. అన్ని కెమెరాలు కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానించి పర్యవేక్షించాలని అన్నారు.  అధికారులు తమ పరిధిలో శాంతి భద్రతలను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి అని, నిత్యం ఫీల్డ్ లో ఉండాలనీ, హత్య కేసులో నిందితులుగా ఉన్న వారి పై రౌడీ షీట్స్ ఓపెన్ చెయ్యాలని అన్నారు. సోషల్ మీడియాలో ఎల్లపుడూ నిఘా ఉంచాలని, గ్రామాలలో వాట్సాప్ గ్రూపులల్ సైతం నిఘా ఉంచాలని అన్నారు. మహిళలపై జరిగే నేరాలు, వేధింపులపై అలసత్వం వద్దని, అట్టి ఫిర్యాదుల పై వెంటనే స్పందించాలని సూచించారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చన్న భ్రమలో యువత, విద్యార్థులు అక్రమ బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ లకు బానిసలుగా మరి, అప్పులపాలపై ప్రాణాలకు మీదకు తెచ్చుకుంటున్నారని, ఆన్నారు. ఆన్లైన్ బెట్టింగ్/ గేమ్స్ కట్టడికి జిల్లా పోలీస్ శాఖ ఆధునిక సాంకేతికతను వినియోగించుకొని ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని, అక్రమ బెట్టింగ్ యాప్స్ లలో బెట్టింగ్ లకు పాల్పడినా, ఆన్‌లైన్ గేమింగ్ యాప్ లలో గేమ్స్ ఆడినా, ప్రోత్సాహించిన చట్ట పరమైన చర్యలు తప్పవని ఎస్పీ తెలియజేసారు.  ప్రజలకు cyber crime fraud ల మీద అవగాహన కల్పించి వాటి బారిన పడకుండా చూడాలని తెలియ జేశారు.
ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రతి రోజు విజిబుల్ పోలీసింగ్ చేయాలి.  బ్లాక్ స్పాట్లను గుర్తించి స్పీడ్ నియంత్రణ కోసం తగు జాగ్రత్తలు తీసుకొని ప్రజలకు ట్రాఫిక్ నియమాలు పాటించేలా అవగాహన కల్పించాలి.  ట్రాఫిక్ నియంత్రణ పై మరియు రోడ్డు ప్రమాదాలపై మరియు రోడ్డు ప్రమాదాలు జరిగే కారణాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఇందులో భాగంగానే ఇటీవల ట్రాఫిక్ నియత్రాణ సామాగ్రిని అన్ని పొలీస్ స్టేషన్లు కు సరఫరా చేయటం జరిగింది. వాటిని సమర్థవంతంగా వినియోగించాలి.రాత్రి వేళల్లో హోటళ్లలో , డాబాల్లో మద్యం సేవించి వాహనాలు నడపటం వాళ్ళ ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి అని గ్రహించి, ఇందులో భాగంగానే మంగళ వారం రోజు రాత్రి డాబా లాపై ఆకస్మిక తనిఖి నిర్వహించటం జరిగింది.చేపట్టిన ప్రతి ప్రోగ్రాం అనగా పోలీస్ అక్క, నారి శక్తి, ప్రజావాణి కార్యక్రమాలను పోలీస్ స్టేషన్ పరిధిలో సీనియర్ అధికారులు  ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలియజేసారు.ఈ సమావేశంలో   అదనపు ఎస్పి ఉపేందర్ రెడ్డి, ఏ.ఎస్పీ లు అవినాష్ కుమార్ ఐపిఎస్, రాజేష్ మీన ఐపిఎస్, ఇన్స్పెక్టర్లు అజయ్, నైలు, గోపినాథ్, గోవర్ధన్ రెడ్డి, ప్రేమ్ కుమార్, ప్రవీణ్ కుమార్, కృష్ణ, మల్లేష్, సమ్మయ్య, ఆర్ఐ రామ్ నిరంజన్ రావ్, రమేష్,, అన్ని పోలీస్ స్టేషన్ ల ఎస్ఐ లు, ప్రొబేషనరీ ఎస్ఐ లు, డీసీఆర్బి , ఐటి కోర్ సిబ్బంది తదితరులు  పాల్గొన్నారు.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Error on ReusableComponentWidget

Latest News

అత్యాచారం చేసిన కేసులో నిందితుడిని రిమాండ్ తరలింపు అత్యాచారం చేసిన కేసులో నిందితుడిని రిమాండ్ తరలింపు
  నమస్తే  భారత్ / మద్దూరు, (ఏప్రిల్ 21) : దామరగిద్ద మండలం క్యాతన్ పల్లి గ్రామానికి చెందిన బోయిని శ్రీనివాస్ తండ్రి నారాయణ అను 24
 గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులను చైతన్యం చేయవలసిన బాధ్యత అందరి మీద ఉన్నది.
విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం
నందిగామలో గ్రంథాలయం మంజూరు చేయండి 
ప్రేమలమ్మ మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది 
క్రీడలతోనే మానసిక వికాసానికి దోహదం
భూ భారతి ద్వారా పెండింగ్ లో ఉన్న సాదా బైనమా దరఖాస్తుల క్రమబద్ధీకరణ అవగాహన సదస్సులో కలెక్టర్ అభిలాష అభినవ్ వెల్లడి