మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పైజాన్ అహ్మద్
తేదీ, ఏప్రిల్ 20, 2025-
నమస్తే భరత్ నిర్మల్ // జిల్లావ్యాప్తంగా మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలల్లో 6, 7, 8, 9 వ తరగతుల్లో ఏర్పడిన విద్యార్థుల ఖాళీలను భర్తీ చేసేందుకై ఆదివారం జిల్లాలోని నాలుగు పరీక్ష కేంద్రాల్లో ప్రవేశ పరీక్షను ఏర్పాటు చేశారు. నిర్మల్ లోని జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో ఏర్పాటుచేసిన గురుకుల ప్రవేశ పరీక్ష కేంద్రాన్ని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పైజాన్ అహ్మద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రంలో గల వసతులను ఆయన పరిశీలించారు. పరీక్ష కేంద్రంలో సరైన లైటింగ్, మరుగుదొడ్లు, త్రాగునీరు, తదితర వసతులు సక్రమంగా ఉన్నాయో లేదో ఆయన పరిశీలించారు. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా ఈ పరీక్షకు సంబంధించి మొత్తం 808 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 721 మంది విద్యార్థులు హాజరైనట్లు అధికారులు తెలిపారు. ఈ పరీక్ష కేంద్ర తనిఖీలో డిఈఓ పి. రామారావు, జిల్లా బీసీ సంక్షేమ అధికారి శ్రీనివాస్, డిసిఓ గీత, పర్యవేక్షకులు రమణారెడ్డి, సిఎస్ దశరథ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనిల్ కుమార్, ఉపాధ్యాయులు, ఇతర అధికారులు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

