ఒక్కటైన గళాలు – ఉగ్రవాదానికి గట్టి సమాధానం!
నమస్తే భారత్,షాద్ నగర్ ఏప్రిల్25:పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ ముస్లిం సోదరులు ఐక్యతగా చేపట్టిన నిరసన ర్యాలీ దేశభక్తికి భారత్ దేశ వ్యాప్తంగా స్పూర్తిదాయక సంఘటనగా నిలిచింది. మతాలకు అతీతంగా దేశాన్ని కాపాడే సంకల్పంతో ముందుకొచ్చిన ఈ ర్యాలీ ప్రతి ఒక్క భారతీయుడి గుండెల్లో గర్వాన్ని నింపింది.ఈ సందర్బంగా బీజేపీ యువ నాయకులు శ్రీ ప్రశాంత్ ముదిరాజ్ గారు స్పందిస్తూ:“దేశ భద్రతకంటే గొప్పది ఏ మతమూ కాదు.శుక్రవారం ముస్లిం సోదరులు చూపిన ఐక్యత ప్రతి పౌరుడికి స్పష్టమైన సందేశాన్ని ఇస్తోంది – దేశం మీద దాడి జరిగితే మనమంతా ఒక్కటిగా నిలబడతాం!”
“ఒక్కొక్కడిగా గొంతెత్తితే గళం,
ఒక్కటిగా గర్జిస్తే విప్లవం!
దేశం కోసం మనం ఒక్కటైతే…
ఉగ్రవాదం ఎప్పటికీ ఓడిపోతుంది!”
ఈ సంఘటన ద్వారా ‘దేశ భద్రత’ అనే విషయంపై ప్రజలంతా ఒకటిగా చైతన్యవంతంగా స్పందించిన తీరు, భవిష్యత్ తరాలకు దేశభక్తి పాఠంగా నిలిచే విధంగా ఉంది.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

