రుణాల మంజూరిలో అన్ని వర్గాల వారికి న్యాయం చేయండి 

రుణాల మంజూరిలో అన్ని వర్గాల వారికి న్యాయం చేయండి 

* బీసీ వెనుకబడిన కులాల వారి జీవితాల్లో వెలుగులు నింపండి
* ప్రతి దరఖాస్తుదారుడికి లబ్ధి చేకూరాలి 
* ఆర్థికంగా ఎదిగేందుకు చేయూతనివ్వాలి 
* విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోట శివశంకర్
* బీసీ కార్పొరేషన్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మల్లయ్య బట్టుకి వినతి పత్రం 

నమస్తే భారత్/భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో: రుణాల విషయంలో నిజమైన బీసీలకు అత్యంత వెనుకబడిన కులాల లబ్ధిదారులకు న్యాయం చేయండి అంటూ బీసీ కార్పొరేషన్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మల్లయ్య బట్టుకి శుక్రవారం తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోట శివశంకర్ వినపత్రం అందించి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా బీసీ కార్పొరేషన్ రుణాలకు రాజీవ్ యువశక్తి పథకం కింద అనేకమంది బిసి విద్యార్థులు నిరుద్యోగ యువత బిసి కులాల్లో అత్యంత వెనుకబడినటువంటి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ లోని నిరుద్యోగులు దరఖాస్తులు చేసుకోవడం జరిగిందని వీరందరికీ రుణాలు అందే విధంగా చూడాలని పేర్కొన్నారు. యువకులు ఉన్నత చదువులు చదువుకొని సొంత కాళ్ళ మీద ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయంతో వ్యాపారాలని చేతివృత్తులను అభివృద్ధి చేయడానికి అనేకమంది యువత బిసి కార్పొరేషన్ లోన్లు అప్లై చేసుకున్నారని నీతి నిజాయితీగా పైరవీలకు తావు లేకుండా రాజకీయాల కతీతంగా నిజమైన లబ్ధిదారులకు నిజంగా యూనిట్లు స్థాపించి బిసి బిడ్డలకు విద్యార్థులకు యువతకు మహిళలకు న్యాయం చేయాలని తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం ఆధ్వర్యంలో హైదరాబాదులో బీసీ కార్పొరేషన్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మల్లయ్య బట్టుని మర్యాదపూర్వకంగా కలిసివినతిపత్రం ఇచ్చినట్లు కోట శివశంకర్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా బీసీ విద్యార్థులు యువకులు అనేకమంది ఉన్నత చదువులు చదువుకొని నిరుద్యోగులుగా ఉన్నారని వివరించారు. తెలంగాణలో గత 15 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు లేక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక 15 సంవత్సరాలు ఉద్యోగాలు లేక మొత్తం 30 సంవత్సరాలు చదువుకున్న చదువుకు తగ్గ ఉద్యోగం లేక అనేక మంది నిరుద్యోగులుగా మిగిలిపోవడం జరిగిందన్నారు. ముఖ్యంగా బీసీ కులాల విద్యార్థులు యువకులు బీసీలో అత్యంత వెనుకబడిన కులాలైనటువంటి అనేక ఉప కులాలు ఇంకా దారిద్రరేఖకు దిగువ ఉండి అత్యంత పేదరికం అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయంతో లబ్ధిదారులలో వెలుగులు నిండాలన్నారు. సబ్సిడీ ద్వారా అనేక యూనిట్లను స్థాపించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకొని అవగాహన సదస్సులు ఏర్పాటుచేసి నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోట శివశంకర్ మల్లయ్య బట్టుకు విజ్ఞప్తి చేశారు.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Error on ReusableComponentWidget

Latest News

ఉగ్ర దాడిని నిరసిస్తూ హిందు సంఘాల క్రొవ్వొత్తుల ర్యాలీ ఉగ్ర దాడిని నిరసిస్తూ హిందు సంఘాల క్రొవ్వొత్తుల ర్యాలీ
నమస్తే భారత్ / మద్దూరు, (ఏప్రిల్ 25) : మంగళవారం జమ్ము కాశ్మీర్  పహల్ గాం లోని యాత్రికులపై జరిగిన  ఉగ్రదాడిని నిరసిస్తూ మద్దూరు పట్టణ కేంద్రంలోని...
టూరిస్టులను పొట్టన పెట్టుకున్న దుర్మార్గులను కఠినంగా శిక్షించాలి 
భూ భారతి చట్టంతో పెండింగ్ భూ సమస్యలకు పరిష్కారం, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్
రుణాల మంజూరిలో అన్ని వర్గాల వారికి న్యాయం చేయండి 
ఒక్కటైన గళాలు – ఉగ్రవాదానికి గట్టి సమాధానం!
వరంగల్ సభకుతరలిరండి గులాబీ జెండాను ఎత్తండి మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పిలుపు
కరెంట్ షాక్ తో గర్భిణీ అవు మృతి