ఆంజనేయస్వామి మాలదారులకు అన్నదానం, సాయంత్రం పాలు పండ్లు పంపిణీ
నమస్తే భారత్ :-తొర్రూర్ : మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణ కేంద్రానికి చెందిన కంటాయపాలెం రోడ్డులో గల పాటి మీద శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో హనుమాన్ మాల ధారణ స్వీకరించిన 60 మంది స్వాములకు మధ్యాహ్న భిక్ష మరియు సాయంత్రం పండ్లు పాలు అల్పాహారం మరియు వచ్చినటువంటి భక్తులకు కూడా పట్టణ కేంద్రానికి చెందిన బ్రహ్మశ్రీ ఇటుకేల రాజేంద్రప్రసాదాచార్యులు ధర్మపత్ని సునీత మరియు ఇటికేల రాధాకృష్ణమాచార్యులు ధర్మపత్ని మమత ఓంకార్ జ్యువెలర్స్, మరియు ఇటికేల విశ్వప్రకాశాచార్యులు ధర్మపత్ని విజయలక్ష్మి లలితాంబిక జ్యోతిష్యాలయం మరియు కుటుంబ సభ్యులు. పంపిణీ చేసి మంగళవారం రోజు దాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సేవా కార్యక్రమాల్లో అన్ని దానాలలో కెల్లా అన్నదానాన్ని మించిన దానము మరోటి లేదని భక్తికి, నమ్మకానికి విశ్వాసానికి ప్రతీక, సర్వారిష్టాలను తొలగించే అతిబలవంతుడు ఆంజనేయుడు ఆని వారు కొనియాడారు. ఎంతో ఏకాగ్రతతో నియమనిష్టలతో 21 రోజు 41 రోజు హనుమాన్ మాలధారణ స్వీకరించిన స్వాములకు అన్నదానం చేయడం మాకెంతో సంతృప్తినిచ్చిందని వారన్నారు. ఇంకా ఎవరైనా ఆసక్తిగల దాతలు హనుమాన్ మాలదారులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించేందుకు ముందుకు వచ్చి ఆంజనేయస్వామి కృపకు పాత్రులు కావచ్చని కోరారు. ఈ అన్నదాన కార్యక్రమంలో మిత్రులు మరియు బంధువులు కేశెట్టి చిన్న శ్రీనివాస్ ,బొమ్మకంటి సంజయ్, రాగి ఈశ్వర ప్రసాద్ శర్మ ,సుద్దాల శరత్ శర్మ ,దాశరోజు రిషికేశ శర్మ ,భూసాని ఉపేందర్ ,సర్వే.నాగరాజు ,బొమ్మకంటి సందీప్ ,రాజు ,ఇంకా పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

