అంతర్ జిల్లా ట్రాక్టర్ మరియు ట్రాలీలు ఇతర దొంగతనాలు చేసే దొంగను చేసిన 3 టౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్
నేరస్థుని వివరాలు
👉 చెవుల మల్లేశం తండ్రి రాజయ్య, వయస్సు 40 సంవత్సరాలు, వృత్తి ట్రాక్టర్ డ్రైవర్, మరియు వ్యవసాయం గ్రామం ఇస్సానగర్, మండలం బీబీపేట, జిల్లా కామారెడ్డి.
నేరస్తుని పైన డిసి సీట్ ఓపెన్ చేసి ఉంది (డోస్నర్ క్రిమినల్) సొంత జిల్లాలో కాక ఇతర జిల్లాలలో దొంగతనం చేసే నేరస్తుడు
నమస్తే భారత్: సిద్దిపేట ఏసీపి జి. మధు కేసు వివరాలు తెలియపరుస్తూ మర్పడగ మదిర దోమలోనిపల్లి గ్రామనికి చెందిన దోమల మల్లయ్య రోజు మాదిరిగా తేది: 20.04.2025 నాడు తన యొక్క ట్రాక్టర్ ట్రాలీని తను కౌలుకు చేస్తున్న లక్కిరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవసాయ పొలం వద్ద పెట్టి ఇంటికి వచ్చినాడు. మరుసటి రోజు తేది: 21.04.2025 తన కౌలుకు చేస్తున్న పొలం వద్దకు ఉదయం వెళ్ళేసరికి పొలం వద్ద పెట్టి ఉంచిన ట్రాలీ కనిపించకపోయేసరికి చుట్టూ ప్రక్కల గ్రామలలో వెతికిన ఎలాంటి ఆచూకీ తెలియకపోవడంతో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రాంభించనైనది.సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సిద్దిపేట త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ విద్యసాగర్ హెడ్-కానిస్టేబుల్ తిరుపతిరెడ్డి, కానిస్టేబుళ్లు బాబు, శ్రీనివాస్ లను ప్రత్యేక బృందంగా ఏర్పాటు చేసి నిందితుని ఆచూకీ గురించి వెతుకూచుండగా ఈరోజు తేది: 24.04.2025 నాడు ఉదయం 09.00 గంటలకు సేలంపు గ్రామ శివారులో ట్రాక్టర్ ఇంజన్ తో సహ ఉండగా పట్టుకుని విచారించగా దోమలోనిపల్లి గ్రామ శివారులో దొంగిలించిన ట్రాక్టర్ ట్రాలీ తో పాటు ఫిబ్రవరి నెలలో రాంపల్లి గ్రామ శివారులో దొంగిలించిన జాన్ డీర్ ట్రాక్టర్ ఇంజన్ మరియు ట్రాక్టర్ ట్రాలీని దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు
👉పై నేరస్తుని వద్ద నుండి
వద్ద నుండి జాన్ డీర్ ట్రాక్టర్ ఇంజన్, రెండు ట్రాక్టర్ ట్రాలీలు, మోటార్ సైకిల్ స్వాధీన పరుచుకొని అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్కు పంపించడం జరిగింది.
పై నేరస్తుడు గతంలో దొంగతనం చేసిన వాటి వివరాలు
పై నేరస్తుడు చెడు వ్యసనాలకు అలవాటు పడి మరియు కుటుంబ పోషణ భారంతో సరిగా పని చేయక దోమకొండ, బీబీపేట, భిక్నూర్, మాచారెడ్డి, సదాశివనగర్, మాక్లూర్, ముస్తాబాద్, నిజామాబాద్ టౌన్, నిజామాబాద్ రూరల్, రామాయంపేట పోలీస్ స్టేషన్ ల ఏరియాలలో సుమారు (15) వరకు దొంగతనాలు చేయగా జైలుకు వెళ్ళినాడు. తన గ్రామనికి సమీప గ్రామలలో దొంగతనాలు చేస్తే పోలీస్ వారు నిఘా ఉండడంతో దూర ప్రాంతాలను ఎంచుకోని ముందుగా తన యొక్క మోటార్ సైకిల్ పై తన ఊరు నుండి బయలుదేరి చూసుకుంటూ వచ్చి రాంపల్లి గ్రామ శివారులో బొమ్మ నర్సయ్య పొలం వద్ద నిలిపి ఉంచిన ట్రాక్టర్ ను గమనించి మరుసటి రోజు తేది: 12.02.2025 నాడు రాత్రి సమయమున ఎవరు లేనిది గమనించి జాన్ డీర్ ట్రాక్టర్ ఇంజన్ మరియు ట్రాక్టర్ ట్రాలీని దొంగతనం చేసుకోని పోయి తన స్వగ్రామం నందు గల వ్యవసాయ పొలం వద్ద ఉంచి ఎవరు గుర్తుపట్టకుండా ఉండడానికి గాను నెంబర్ ప్లేట్స్ కు రంగులు వేసినాడు. మరొక ట్రాక్టర్ ట్రాలీ కోసం కూడా అలానే ముందుగా చూసుకోని తేదీ: 20.04.2025 నాడు రాత్రి ట్రాక్టర్ ట్రాలీని దొంగిలించుకపోయినాడు.చాకచక్యంగా టెక్నాలజీతో పై నేరస్తుని పట్టుకొని అరెస్టు చేసిన 3 టౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ మరియు సిబ్బంది తిరుపతి రెడ్డి హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ బాబు, శ్రీనివాస్ లను అభినందించిన సిద్దిపేట ఏసీపీ మధు
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

