టూరిస్టులను పొట్టన పెట్టుకున్న దుర్మార్గులను కఠినంగా శిక్షించాలి
జమాతే ఇస్లామి హింద్ అధ్యక్షుడు షేక్ అబ్దుల్ బాసిత్
నమస్తే భారత్/భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో: జమ్మూ కాశ్మీర్ లో ని పహల్గాంలో టూరిస్టుల పై ఉగ్రవాదులు దాడి చేసి చంపడం దారుణం చాలా బాధాకరమైన విషయమని ఇలాంటి దారుణానికి కులం మతంతో ఎలాంటి సంబంధం లేదని ఇలాంటి దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని జమాతే ఇస్లామి హింద్ రామవరం రుద్రంపూర్ శాఖ అధ్యక్షుడు షేక్ అబ్దుల్ బాసిత్ అన్నారు. చుంచుపల్లి మండలం రుద్రంపూర్ పంచాయతీలోని మస్జిద్ ఎ ఖుబాలో శుక్రవారం ప్రత్యేక నమాజ్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖురాన్ లో అల్లాహ్ ఒక మనిషి ప్రాణాన్ని తీయడం యావత్ మానవాళి ప్రాణం తీసినట్లు అని ఒక మనిషి ప్రాణం కాపాడితే యావత్ మానవాళి ప్రాణం కాపాడినట్లు అని హితబోధ చేశాడన్నారు. హింస ద్వారా పేరు ధర్మాన్ని అణుచడం అత్యంత హేయమైన చర్య అని కూడా దైవం సెలవిచ్చాడని పేర్కొన్నారు. తన చేతల ద్వారా చూపుల ద్వారా ఆలోచన ద్వారా ఎవరికైనా నష్టం కష్టం కలిగిస్తే మీరు విశ్వాసులే కాదని చెప్పడం జరిగిందన్నారు. ద్వేషించే వారిని ప్రేమించమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారని పేర్కొన్నారు. మంచి చెడు ఒకటి కాదు చెడును అతి శ్రేష్టమైన మంచి ద్వారా తొలగించు నీ ప్రాణ శత్రువు సైతం నీ ప్రాణ స్నేహితులు అయిపోవడం మీరు గమనిస్తారని ఖురాన్ బోధిస్తుందన్నారు. అమాయకులను చంపమని ఇస్లాం ఏనాడూ ప్రోత్సాహించదని అన్నారు. ప్రతి మతం మంచిని మానవత్వాన్ని చాటి చెప్పుతుందన్నారు. ముక్కు పచ్చలారని వధువుతో పాటు అమాయకులైన వారిని పొట్టన పెట్టుకున్న దుర్మార్గులను కఠినంగా శిక్షించాలన్నారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మేరుగైన వైద్యం అందించాలన్నారు. స్వార్థ రాజకీయాలకు స్వస్తి పలికి కులమతాల మధ్య శాంతి సామరస్యం కోసం కృషి చేయాలని ఉగ్రవాదానికి మతానికి ఎలాంటి సంబంధం ఉండదన్నారు.
ఇలాంటి సంఘటనలను మానవతా వాదులందరు ఖండించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మస్జిద్ ఇమామ్, షబ్బీర్, రజాక్, సోను బాయ్, అజ్హర్, రఫీ, ఆలం, షమీం తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

