పహాల్గమ్ ఉగ్ర దాడిని కండించిన బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి
నమస్తే భరత్,,,, 24/4/2025/ : నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో , నర్వ మండలం,,కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లా, పహెల్గాంలో కొంత మంది పాకిస్థాన్ ఉగ్రమూకలు అమాయకులైన 28 మంది భారతీయులను నిర్దాక్షిణ్యంగా కాల్చి వేసిన ఘటన యావత్ భారతదేశాన్ని కంట తడి పెట్టించే విదంగా చేసిందని బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి అన్నారు.*ఇట్టి సంఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కిషన్ రెడ్డి గారి ఆదేశాలమేరకు మక్తల్ నియోజకవర్గం నర్వ మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు టి అజిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీజేపీ పదాది కారుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి గారు పాల్గొని మాట్లాడుతూ పహెల్గాం దుర్ఘటన ఒక పిరికిపంద చర్యగా, అమానవీయ దుశ్చర్యగా ఉందని చెప్పారు.పహెల్గామ్ దాడికి త్వరలోనే ప్రపంచం ఉలిక్కి పడే విదంగా శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుంటుందని పాకిస్థాన్ ఉగ్రమూకలను, వారికి సహకరించిన మతోన్మాదులను ఎక్కడ వున్నా వెతికి పట్టుకొని ఏరిపారేయడం ఖాయమని హెచ్చరించిన బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి. ఇట్టి కార్యక్రమాన్ని నర్వ మండల కేంద్రంలో అంబేద్కర్ కూడలిలో ఉగ్రవాదుల చేతిలో అమరులైన భారతీయులుకు నివాళులర్పించి 2 నిమిషాలు మౌనం పాటించి, క్యాండిల్స్ వెలగించి సంతాపం తెలియజేసారు. ఇట్టి కార్యక్రమంలో నర్వ మండల భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు అజిత్ సింహ రెడ్డి గారు సీనియర్ నాయకులు జగన్నాథం గారు డాక్టర్ బాబు గారు ఆర్మీ హనుమంత్ గారు హోటల్ హనుమంత్ రెడ్డి గారు టి రాంరెడ్డి గారు విజయరామ్ గారు రాయికోడ్ శ్రీనివాస్ రెడ్డి గారు నర్వ మండల వివిధ గ్రామాల భూత్ అధ్యక్షులు వివిధ మోర్చాల అధ్యక్షులు బీజేవైఎం పదాధికారులు నర్వ మండల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు హిందూ బంధువులు మరియునర్వ గ్రామ ప్రజలు యువకులు తదితరులు పాల్గొన్నారు*
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
