రాజీవ్ రహదారి పొన్నాల డాబాల ఫ్లైఓవర్ వద్ద సీట్ బెల్టు మరియు ఫైన్ అమౌంట్ పెండింగ్ ఉన్న కార్లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన సిద్దిపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్
నమస్తే భారత్ తేదీ: 24-ఏప్రిల్-2025 : ఈ సందర్భంగా వాహనదారులతో మాట్లాడుతూ నాలుగు చక్రాల వాహనాలు నడిపేవారు తప్పకుండా సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు ఏదైనా అనుకోకుండా ప్రమాదం జరిగితే సీట్ బెల్ట్ ధరించడం వల్ల కారులో ఉండే ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయి అందులో ఉన్నవారికి దెబ్బలు తగలకుండా రక్షణ కవచంగా నిలుస్తాయని తెలిపారు. అధిక వేగంతో వాహనాలు నడపవద్దని సూచించారు. వేసవికాలం అయినందున ప్రతిరోజు వాహనాన్ని తనిఖీ చేసుకోవాలని సూచించారు ఎండలు బాగా ఉన్నందున ఉదయం 11 గంటల లోపు మరియు సాయంత్రం నాలుగు గంటల తర్వాత ప్రయాణం చేయడం చాలా సురక్షితమని తెలిపారు.కార్లపై అధిక వేగము, రాంగ్ పార్కింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, వితౌట్ సీట్ బెల్ట్, ఈరెగ్యులర్ నెంబర్ ప్లేట్ చేసిన ఫైన్ అమౌంట్ వాహనాలను గుర్తించి వాటిపై ఉన్న జరిమానా డబ్బులు 42,000/- రూపాయలు ఆన్లైన్లో కట్టించడం జరిగింది. కారణం లేని మరణం ఒక రోడ్డు ప్రమాదమేనని తెలిపారు. ప్రతి వాహనదారుడు రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహనాలు నడిపి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రవీణ్ కుమార్ సిద్దిపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

