వరంగల్ సభకుతరలిరండి గులాబీ జెండాను ఎత్తండి మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పిలుపు
నమస్తే భారత్ / నారాయణపేట్ జిల్లా : ఈనెల 27న వరంగల్ జిల్లా కేంద్రంలో జరిగే బిఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు గులాబీ జెండా చేతపుని పెద్ద ఎత్తున తరలిరావాలని మాజీ శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు శుక్రవారం ఉదయం మక్తల్ పట్టణంలోని జాతీయ రోడ్డు పైన వరంగల్ సభకు సంబంధించిన గోడ పోస్టర్ వేసి అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి గులాబీ జెండా ఒకటే శ్రీరామరక్ష అని అందుకు ప్రతి గ్రామ మండల జిల్లా స్థాయి నుంచి పెద్ద ఎత్తున ఆ సభకు స్వచ్ఛందంగా తరలి వెళ్లడానికి ప్రజల సిద్ధమయ్యారని చెప్పారు ఈ సభ దేశములనే అతిపెద్ద సభగా నిల్చడం ఖాయమని చెప్పారు బిఆర్ఎస్ పార్టీ స్థాపించి 25 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఇంత పెద్ద సభను నిర్వహించడం పట్ల తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు సొంత ఇంట్లో జరిగే పండుగగా స్వీకరిస్తున్నారని తెలిపారు ఈ సభకు మక్తల్ నియోజకవర్గం నుంచి దాదాపు 5,000 మంది ప్రతినిధులు వెళ్లడం జరుగుతుందని తెలిపారు అందుకు కావాల్సిన ఏర్పాట్లు అన్ని పూర్తి చేశామని చెప్పారు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో కార్యకర్తలు సభకు వెళ్లేటప్పుడు ఆయా గ్రామాలలో పార్టీ జెండాను ఆవిష్కరించి బయలుదేరాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పి నరసింహ గౌడ్ పట్టణ పార్టీ అధ్యక్షుడు చిన్న హనుమంతు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ అన్వర్ హుస్సేన్ బిఆర్ఎస్ పార్టీ నాయకులుగోవిందరావు జుట్ల శంకరు గుర్లపల్లి గాలి రెడ్డి బండారి ఆనందు కర్రెమ్ అంజనేయులు మామిళ్ళ అమ్రేష్ భూత్పూర్ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

