సన్మార్గంలో నడిచేందుకు ఆధ్యాత్మికంతో పాటు క్రీడలు అవసరం.శ్రీ  ఆదిత్య పరాశ్రీ స్వామి

--అంబాత్రయ క్షేత్రంలో అట్ట హాసంగా 44వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ షూటింగ్ బాల్  పోటీలు ప్రారంభం 

సన్మార్గంలో నడిచేందుకు ఆధ్యాత్మికంతో పాటు క్రీడలు అవసరం.శ్రీ  ఆదిత్య పరాశ్రీ స్వామి

నమస్తే భారత్ / ఉట్కూర్ మండలం : చిన్నతనం నుంచే సన్మార్గంలో నడిచేందుకు  ఆధ్యాత్మికంతో పాటు ఆటలు ఎంతో అవసరమని బిజ్వార్ అంబాత్రయ క్షేత్ర వ్యవస్థాపకులు ఆదిత్య పరాశ్రీ స్వామి అన్నారు. శుక్రవారం ఉట్కూర్   మండలంలోని బిజ్వార్ గ్రామంలో నీ అంబాత్రయ క్షేత్రం ఆవరణలో   44వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ షూటింగ్  బాల్ పోటీలు 25 నుంచి 27వ తేదీ వరకు మూడు రోజులపాటు జరిగే పోటీలను ఆదిత్య పరాశ్రీ స్వామి ప్రారంబించారు.ఈ పోటీలు అట్ట హసంగా ప్రారంభం అయ్యాయి.ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతు ఆధ్యాత్మికం తోనే భక్తి సన్మార్గం ఏర్పడుతుందని అన్నారు.అలాగే క్రీడలు క్రమశిక్షణ అలవరుస్తాయని దాంతో వ్యసనాలకు దూరమై ఆరోగ్యంగా ఉంచుతాయి అన్నారు.ఆరోగ్యంఆధ్యాత్మికం తోడైతే సన్మార్గం ఏర్పడుతుందనిఅన్నారు.అందరూ సన్మార్గంలో నడిచి దేశభక్తి ఆధ్యాత్మికతను పెంపొందించాలని ఉపదేశించారు.ఈ క్రీడల్లో రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల నుండి 600 మంది బాలబాలికలు షూటింగ్ బాల్ పోటీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ సెక్రటరీ సిహెచ్ ఐలయ్య టోర్నమెంట్ ఆర్గనైజర్ రమేష్ రిటైర్డ్ పి ఈ టి గోపాలం. పిడిలు,  పి టి లు  విష్ణువర్ధన్ రెడ్డి. ఆంజనేయులు మంజునాథ్ శ్రీనివాస్ పవన్ సాయి రాఘవేందర్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు ఫోటో రైట్ అప్:క్రీడాకారుల తో  ఆదిత్య పరాశ్రీ స్వామి

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Error on ReusableComponentWidget

Latest News

ఉగ్ర దాడిని నిరసిస్తూ హిందు సంఘాల క్రొవ్వొత్తుల ర్యాలీ ఉగ్ర దాడిని నిరసిస్తూ హిందు సంఘాల క్రొవ్వొత్తుల ర్యాలీ
నమస్తే భారత్ / మద్దూరు, (ఏప్రిల్ 25) : మంగళవారం జమ్ము కాశ్మీర్  పహల్ గాం లోని యాత్రికులపై జరిగిన  ఉగ్రదాడిని నిరసిస్తూ మద్దూరు పట్టణ కేంద్రంలోని...
టూరిస్టులను పొట్టన పెట్టుకున్న దుర్మార్గులను కఠినంగా శిక్షించాలి 
భూ భారతి చట్టంతో పెండింగ్ భూ సమస్యలకు పరిష్కారం, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్
రుణాల మంజూరిలో అన్ని వర్గాల వారికి న్యాయం చేయండి 
ఒక్కటైన గళాలు – ఉగ్రవాదానికి గట్టి సమాధానం!
వరంగల్ సభకుతరలిరండి గులాబీ జెండాను ఎత్తండి మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పిలుపు
కరెంట్ షాక్ తో గర్భిణీ అవు మృతి