వేసవి కాలము దొంగలతో జాగ్రత్త

గ్రామాలలోని ప్రజలు పట్టలాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

వేసవి కాలము దొంగలతో జాగ్రత్త

ఇంటి పరిసరాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు శ్రేయస్కరం

 కొత్తవారి కదలికలపై సమాచారం అందించాలి

ముఖ్యంగా సాయంత్రం గల్లీలలో, కాలనీలకు వచ్చే వారిపై ఒక కన్నేసి ఉంచాలి  వచ్చే

వేసవిలో చోరీల నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టాం,  ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం. పగలు/రాత్రి వేళల్లో వీధుల్లో గస్తీ ఏర్పాటు చేస్తున్నాం, సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి


సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపీఎస్., మేడమ్ గారు

నమస్తే భారత్ : వేసవి కాలం.. పెరిగిన ఎండలు.. పిల్లలకు సెలవులుండటంతో చాలా మంది ప్రయాణాలు చేస్తారు. ఇదే అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తారు.  వేసవిలో విహార యాత్రలు, తీర్థ యాత్రలు, ఊళ్లకు వెళ్ళే వారు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు

1 దూర ప్రాంతాలకు వెళ్లేవారు తమ ఇంటి చిరునామా, ఫోన్‌ నెంబర్‌ను సంబంధిత పోలీసు స్టేషన్‌ లో తెలపాలి.
2 ఊళ్లకు వెళ్ళేవారు ఇంటిని గమనించమని ఇరుగు/పొరుగు నమ్మకస్తూలైన వారికి చెప్పి వెళ్లాలి. 
3 సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేను సైతం/ కమ్యూనిటీ, అనే కార్యక్రమం ద్వారా ప్రజలు ప్రజాప్రతినిధుల, సి.ఎస్.ఆర్ దాతల సహకారంతో జిల్లాలో ఇప్పటి వరకు 6,500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. సీసీ కెమెరాల ద్వారా ఎన్నో సంచలనాత్మక నేరాలను చేదించడం జరిగింది. ప్రజలు తమ కాలనీలు, ఇళ్లు, పరిసరాలు, షాపింగ్‌ మాళ్లలో సీసీ కెమెరాలు అమర్చుకోవాలి. 
4 కిటికీల వద్ద ఇంటి తాళాలు పెట్టి నిద్రించకూడదు. 
5.ఇంటి కిటికీలను మూసివేయాలి. వాటికి ఉన్న బోల్టులు సక్రమంగా ఉన్నాయో లేదో ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలి.
6 బంగారు ఆభరణాలు ధరించి ఆరుబయట నిద్రించకూడదు. ఇంట్లో పడుకున్నా కిటికీలు తెరిచి ఉండే వైపు పడుకోరాదు.
7 దుస్తుల్లో డబ్బులు పెట్టి కిటికీలకు, తలుపులకు తగిలించరాదు.
8.వేసవిలో కిటికీకు తెరిచి నిద్రిస్తుంటారు. దొంగలు కిటికీల్లోంచి నీళ్లు చల్లి బయటకు రాగానే దోచేస్తారు. 
9 డాబాలు, ఆరుబయట చల్లగాలికి పడుకున్న వారి ఇళ్లలో దొంగతనాలు జరిగే అవకావాశాలు ఎక్కువగా ఉంటాయి. రాత్రి సమయాల్లో ఆరుబయట పడుకోవడం దొంగలకు తాళం ఇచ్చినట్టే అవుతుంది. వీలునంత వరకూ ఇంట్లోనే పడుకోవడం ఉత్తమం. ఇంటి ఆవరణలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం, పెంపుడు కుక్కలను సాకడం ఉత్తమం.
10 మేడపై నిద్రించే వారు ఒంటిపై నగలు వేసుకుంటే దొంగలు నగలు లాక్కెళ్లే ప్రమాదం ఉన్నందున నగలు ధరించరాదు. 
11 పగటి వేళల్లో ఎక్కువగా ఇంటికి వచ్చి బంగారాన్ని మెరుగుపెడతామని చెప్పేవారిని నమ్మవద్దు.
12 ఇంటికి తాళం వేసిన తర్వాత తాళం కనబడకుండా డోర్‌ కర్టెన్‌ వేయాలి.
13 మహిళలు బయటకు వెళ్లే సమయంలో మెడచుట్టూ కొంగు కప్పుకొని వెళ్లాలి. సాధ్యమైనంతా వరకు బంగారాన్ని ప్రదర్శించవద్దు.
14 గ్రామాలకు వెళ్లే వారు ఇంట్లో ఏదో ఒక గదిలో లైటు వేసి ఉంచాలి.
15 ఎక్కువ రోజులు విహారయాత్రల్లో ఉంటే పేపర్‌ పాల వారిని రావద్దని చెప్పాలి.
16 పని మనుషులను ఉంటే రోజూ వాకిలి ఊడ్చమని చెప్పాలి.
17 విలువైన వస్తువుల సమాచారాన్ని, వ్యక్తిగత ఆర్థిక విషయాలను ఇతరులకు చెప్పకూడదు.
18 తాళం చెవి ఇంటి పరిసర ప్రాంతాలలో పెట్టకూడదు. 
19 అనుమానాస్పద వ్యక్తులను ఇంట్లోకి రానివ్వకూడదు. 
21 అపార్ట్మెంట్లలో కాలనీలలో నమ్మకమైన సెక్యూరిటీ గార్డులను, వాచ్ మెన్ ను నియమించుకోవాలి.
22 వేసవిలోని అమావాస్య రోజుల్లో దొంగతనాలకు ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. దొంగలు ముందుగా పగటి వేళల్లో కాలినడకన, నెంబర్‌ లేని వాహనాలపై సంచరిస్తూ రెక్కీ నిర్వహించి.. అవకాశం ఉన్న ఇంట్లో దొంగతనాలు చేస్తారు. ఇంకా తెరిచి ఉన్న కిటికీల ద్వారా పొడవాటి కర్ర సహాయంతో ఇంట్లో ఉన్న వస్తువులను, కొక్కానికి వేసిన బట్టలు, బ్యాగులు బయటకు తీసి అందులో ఉన్న నగలు, నగదును దోచేస్తారు.
23 సాధారణ భద్రతా ప్రమాణాలు పాటించని ఇండ్లు, చీకటి ప్రదేశం, పాత గ్రిల్స్‌, బలహీనమైన తాళాలు ఉన్న ఇండ్లలో దొంగలు పడే అవకశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి, కొత్త వ్యక్తుల కదలికలపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. 
24 వేసవి కాలంలో తాళం వేసిన ఇండ్లు, ఇంటి ముందు పార్కింగ్‌ చేసిన వాహనాలు, ఆటోలను దొంగలు తస్కరిస్తారు. జన సంచారంతో కూడిన బస్‌స్టేషన్‌లు, పార్కులు, గార్డెన్స్‌, కళాశాలలు, షాపుల ముందు నిలిపిన వాహనాలు చోరీ అవుతాయి. ఆరుబయట వాహనాలకు హాండిల్‌లాక్‌తో పాటు వీల్‌ లాక్‌ వేయాలి, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. 
25 శుభకార్యాల్లో బంధువుల్లా కలిసిపోయి దృష్టి మరల్చి దొంగతనాలు చేస్తారు. ఒంటరిగా వెళ్లే మహిళల మెడ నుంచి గోల్డ్‌ చైన్‌ను దొంగిలించడం వంటివి జరుగుతాయి. అప్రమత్తంగా ఉండాలి. బయటకు ఒంటరిగా వెళ్తున్నప్పుడు బంగారు నగలను ధరించకపోవడం ఉత్తమం. అవసరమైతే గిల్ట్ నగలను ధరించండి. 
26 పగటి వేళల్లో కాలనీల్లో చిరువ్యాపారుల్లా, సేల్స్‌ రిప్రజెంటేటివ్‌ల్లా, అడ్రెస్ కోసం వెతుకుతున్న వారిలా పర్యటిస్తూ రెక్కీ నిర్వహిస్తారు. అనుమానాస్పద వ్యక్తులుంటే స్థానిక పెట్రోలింగ్ పోలీసులకు మరియు పోలీస్ స్టేషన్ లో  ఫిర్యాదు చేయాలి.
27 ఇంట్లో బంగారు నగలు, నగదు ఉంటే వాటిని బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవడం క్షేమం. లేదా ఎక్కువ రోజులు ఊలకు వెళ్లేవారు విలువైన వస్తువులు వెంట తీసుకెళ్లాలి.
28 బ్యాగుల్లో బంగారు నగలు, డబ్బు పెట్టుకొని ప్రయాణం చేస్తున్నప్పుడు బ్యాగులు దగ్గరలో పెట్టుకోవాలి. బ్యాగు బస్సులో పెట్టి కిందికి దిగితే దొంగలు అపహరిస్తారు. 
29 ఇంటి డోర్‌కు సెంట్రల్ లాకింగ్ సిస్టంట్‌ను ఏర్పాటు చేసుకోవడం సురక్షితం. 
30 ఎక్కువగా శబ్ధం వచ్చే కూలర్లు వాడకూడదు. దొంగల అలికిడి వినిపించదు. 
31 అనుమానాస్పద వాహనాల్లో ప్రయాణించరాదు.
32 వీలైతే ఇంటి ఆవరణలో పెంపుడు కుక్కలను కట్టేయాలి. ఇంట్లో ఎటువంటి శబ్దం, అలికిడి వినిపించినా వెంటనే అప్రమత్తం కావాలి. అలసత్వం ప్రదర్శించరాదు.
33 వృద్ధులు, మహిళలు, చిన్నారులు రాత్రి వేళ ఒంటరిగా ఉండకుండా జాగ్రత్త పడాలి.
34 చిన్నారుల మెడలో ఎక్కువగా బంగారం ఉంచడం శ్రేయస్కరం కాదు.  
35 అపరిచిత వ్యక్తులకు ఇళ్లు అద్దెకు ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే ఆరాతీయడం, వారి ఫోన్ నెంబర్లును, వివరాలను సేకరించాలి. దీని ద్వారా చోరీలు జరిగే అవకాశాలను నివారించవచ్చు.  

36 కాలనీవాళ్లు కమిటీలు వేసుకొని వాచ్‌మెన్లను, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి. 
37 రాత్రి సమయంలో కొత్తవారు ఎవరైనా వచ్చినా వారి వివరాలు తెలుసుకుని రిజిస్టర్‌లో నమోదు చేసుకోవడం మంచిదని అపార్టుమెంట్‌ వాచ్‌మెన్‌లకు తెలపాలి.

38 తమ ప్రాంతంలో గస్తీ ఏర్పాటుకు సహకరించాలి. పోలీసు స్టేషన్‌ నెంబర్, వీధుల్లో వచ్చే బ్లూ కోల్డ్స్,పెట్రో కార్  పోలీస్ సిబ్బంది యొక్క  నెంబర్‌ దగ్గర పెట్టుకోవాలి. ప్రజలు నిరంతరం పోలీసులతో సమన్వయంగా సహకరిస్తే చోరీలను నియంత్రించడం చాలా సులభం.
39 ఎప్పుడు కూడా స్థానిక పోలీసు స్టేషన్‌ నెంబర్‌ దగ్గరుంచుకోవడం మంచిది.  కాలనీలలో/గ్రామాలలో అనుమానాస్పద, కొత్త వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే 100 డయల్‌ లేదా సిద్దిపేట పోలీస్ కంట్రోల్ రూమ్  నెంబర్‌ 8712667100, కు సమాచారం అందించాలని సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందని పోలీస్ కమిషనర్ మేడమ్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. కమిషనర్ కార్యాలయం నుండి జారీ చేయనైనది.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Error on ReusableComponentWidget

Latest News

ఉగ్ర దాడిని నిరసిస్తూ హిందు సంఘాల క్రొవ్వొత్తుల ర్యాలీ ఉగ్ర దాడిని నిరసిస్తూ హిందు సంఘాల క్రొవ్వొత్తుల ర్యాలీ
నమస్తే భారత్ / మద్దూరు, (ఏప్రిల్ 25) : మంగళవారం జమ్ము కాశ్మీర్  పహల్ గాం లోని యాత్రికులపై జరిగిన  ఉగ్రదాడిని నిరసిస్తూ మద్దూరు పట్టణ కేంద్రంలోని...
టూరిస్టులను పొట్టన పెట్టుకున్న దుర్మార్గులను కఠినంగా శిక్షించాలి 
భూ భారతి చట్టంతో పెండింగ్ భూ సమస్యలకు పరిష్కారం, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్
రుణాల మంజూరిలో అన్ని వర్గాల వారికి న్యాయం చేయండి 
ఒక్కటైన గళాలు – ఉగ్రవాదానికి గట్టి సమాధానం!
వరంగల్ సభకుతరలిరండి గులాబీ జెండాను ఎత్తండి మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పిలుపు
కరెంట్ షాక్ తో గర్భిణీ అవు మృతి