డ్రగ్స్ నిర్మూలన అవగాహన వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన: జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ ఐపియస్
నమస్తే భారత్ / నారాయణపేట్ జిల్లా :
-డ్రగ్స్ నిర్మూల అందరి సామాజిక బాధ్యత.
-డ్రగ్స్ మత్తుతో జీవితం నాశనం అవుతుంది.
-డ్రగ్స్ వినియోగించిన, రవాణా చేసిన శిక్షలు తప్పవు.
గురువారం ఉదయం జిల్లా పోలీసు కార్యాలయం నందు జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నశా ముక్తభారత్ అభియాన్, డ్రగ్స్ వాడకాన్ని నిషేధిస్తూ డ్రగ్స్ నిర్మూలనలో బాగంగా ఏర్పాటు చేసిన అవగాహన పోస్టర్ ను జిల్లా ఎస్పి యోగేష్ గౌతమ్ ఐ పి యస్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఐపీయస్ మాట్లాడుతూ.డ్రగ్స్ వల్ల సమాజంలో యువ శక్తి విచ్ఛిన్నం అవుతుంది అని డ్రగ్స్ మత్తులో దాడులు, నేరాలు పెరుగుతున్నాయి అని అన్నారు. ప్రజలు డ్రగ్స్ నిర్మూలనలో ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలి అని అన్నారు. యువత, విద్యార్థులు దేశ సంపద, దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉన్నది కావున విద్యార్థుల్లో, యువతలో మార్పు రావాలి అన్నారు. డ్రగ్స్ వినియోగం వల్ల శరీరంలో శక్తి తగ్గుతుంది అని మంచి భవిష్యత్తును కోల్పోతారు అదో వ్యసనంగా మారుతుందని తెలిపారు. వీటిని వినియోగించే వారికి సమాజంలో చెడ్డపేరు వస్తుంది అని అన్నారు. గంజాయి, కొకైన్, హెరాయిన్ లాంటి మాదకద్రవ్యాల వల్ల అన్ని కోల్పోతారు అన్నారు, ఇది మన దేశ యువ శక్తిని నిర్వీర్యం చేస్తుంది అన్నారు. డ్రగ్స్ వినియోగం, రవాణా, సరఫరా చేయడం తీవ్రమైన నేరం అన్నారు. డ్రగ్స్ కు అలవాటు పడిన వారి గురించి సమాచారం ఇవ్వండి వీరికి కౌన్సిలింగ్ ఇస్తాము వీరిలో మార్పునకు కృషి చేస్తాము అని అన్నారు. నారాయణపేట జిల్లాలో డ్రగ్స్ లేకుండా నిర్మూలించడం మన అందరి బాధ్యత అన్నారు. అలాగే మత్తు పదార్థాలైన డ్రగ్స్ గంజాయి నిర్మూలన కోసం సంయుక్తంగా ప్రజలకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో డీ డబ్ల్యూ ఓ జయ, ఎఫ్ ఆర్ ఓ సాయి, వాలంటీర్స్ సంధ్య, లక్ష్మీకాంత్ పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

