ఈనెల 24న, అబ్బాయిపాలెం గ్రామంలో మెగా ఉచిత కంటి ఆపరేషన్ శిబిరం
ప్రగతి సేవా సమితి జిల్లా కో ఆర్డినేటర్ ఐనాల పరశురాములు
నమస్తే భారత్ :-మరిపెడ : ఈనెల 24న, అబ్బాయిపాలెం గ్రామంలో ప్రగతి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత మెగా కంటి ఆపరేషన్ శిబిరాన్ని ఉపయోగించుకోవాలని ప్రగతి సేవా సమితి మహబూబాబాద్ జిల్లా కో ఆర్డినేటర్ ఐనాల పరశురాములు కోరారు. ప్రగతి సేవా సమితి వ్యవస్థాపకులు గద్దల జాన్ ఆదేశానుసారం మండల నలుమూలలకు ఉచిత కంటి ఆపరేషన్ పై అవగాహన కల్పిస్తు క్యాంపియన్ చేస్తున్న సందర్భంగా మంగళవారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని స్థానిక బస్ స్టాండ్ ఆవరణలో ఉచిత కంటి ఆపరేషన్ శిబిరంకు సంబంధించిన ప్రచార ఆటోను ప్రారంభించి ఈసందర్భంగా ఐనాల పరశురాములు మాట్లాడుతూ ఈనెల 24న, గురువారం రోజున మరిపెడ మండలం అబ్బాయిపాలెం గ్రామంలోని స్థానిక ప్రభుత్వ పాఠశాల ఆవరణ లొ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు శంకర కంటి ఆసుపత్రి, జిల్లా అంధత్వ నివారణ సంస్థ, ప్రగతి సేవా సమితి ఆధ్వర్యంలో పూర్తి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి శంకర కంటి ఆసుపత్రి నందు ఉచితంగా కంటి ఆపరేషన్ లు చేయిస్తామని తెలిపారు. ఉచిత కంటి ఆపరేషన్ శిబిరానికి వచ్చే రోగులు ఆధార్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు జీరాక్స్ లు మరియు ఫోన్ నెంబర్, వారు వివిధ జబ్బులకు రోజు వాడే మందులు తప్పని సరిగా వెంట తెచ్చుకోవాలని తెలిపారు. వినికిడి లోపం ఉన్నవారు మాత్రమే వెంట సహాయకులను తీసుకొని రావాలని , వెంట ఒక జత బట్టలు అవసరమైన సామాగ్రి తెచ్చుకోవలని కోరారు. ఈకార్యక్రమంలో ప్రగతి సేవా సమితి మరిపెడ మండల కో ఆర్డినేటర్ జినక సువార్త అబ్బాయిపాలెం కో ఆర్డినేటర్ జినక కృష్ణమూర్తి , మరిపెడ టౌన్ కో ఆర్డినేటర్ బోడ తుల్సా నాయక్ తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

