కారు సారు సర్కారు వైపే ప్రజల చూపు 

సారు  కోసం మళ్ళీ సమాయత్తమవుదాం 

కారు సారు సర్కారు వైపే ప్రజల చూపు 

కాంగ్రెస్ పాలనలో ఆర్థిక రంగం ఆగమాగం

గులాబీ జెండానే తెలంగాణకు బాసట.. 
వరంగల్లు గడ్డమీద ఎగరాలి స్వాభిమాన బావుట

చలో వరంగల్..లక్షలాదిగా తరలివెళదాం..
బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేద్దాం. 

 రాజేంద్రనగర్ నియోజకవర్గం టిఆర్ఎస్ ఇన్చార్జి పటోళ్ల కార్తీక్ రెడ్డి  పిలుపు

నమస్తే భారత్,  రాజేంద్రనగర్, ఏప్రిల్ 21. : దశాబ్ద కాలంగా అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ప్రజలను రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందంజలో ఉంచిందని సారు కారు సర్కారు వైపే ప్రజల చూపు ఉన్నదని రాజేంద్రనగర్ టిఆర్ఎస్ ఇన్చార్జి పట్టొళ్ల కార్తిక రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ పురపాలక పరిధిలోని హుడా కాలిలో సోమవారం టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పట్టొళ్ల కార్తిక రెడ్డి మాట్లాడుతూ ఈనెల ఏప్రిల్ 27వ తారీకు వరంగల్లో జరగనున్న బిఆర్ఎస్ రజతోత్సవ సభకు వేలాదిగా తరలి వెళ్లి సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.ఈ సందర్భంగా బిఆర్ఎస్ 25 సంవత్సరాల రజతోత్సవము సందర్భముగా కార్తీక్ రెడ్డి   మాట్లాడుతూ..కేసీఆర్‌ పాలనే బెస్ట్‌ అని దశాబ్దంలో మారిన తెలంగాణలోని గ్రామాల రూపురేఖలు అని కొనియాడుతూ వాటి గురించి వివరంగా తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు టిఆర్ఎస్ వైపు ఉన్నారని అన్నారు.పదేండ్లపాటు పరుగులు పెట్టిన రాష్ట్ర ఆర్థిక రంగం ఇప్పుడు అగమ్య గొచరంగా మారిందన్నారు. జీఎస్డీపీ, తలసరి, జీఎస్టీ వసూళ్లలో గణనీయ వృద్ధి సాధించిన రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన తర్వాత   ప్రభుత్వ పాలనలో ఆర్థికం ఆగమాగంఅయ్యాయిందని తెలిపారు. 16 నెలల కాలంలో  ప్రజల కొనుగోలు శక్తితగ్గిందన్నారు. ఇందుకు రవాణా శాఖ ఆదాయం పడిపోవడమే నిదర్శనం కాదా అన్నారు.ఉమ్మడి పాలనలో దగాపడిన తెలంగాణ.. పదేండ్ల కేసీఆర్‌ హయాంలో ధనిక రాష్ట్రంగా విరాజిల్లిందని. ఆర్థిక, సామాజిక, సంక్షేమ రంగాల్లో కొత్త శిఖరాలను అధిరోహించిన రాష్ట్రం నేడు అగాధం లో పడిందన్నారు. అయితే, ఏదో శాపం తగిలినట్టు కేవలం 16 నెలల్లోనే మారిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో సంక్షేమంతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులూ తలకిందులయ్యాయి అయ్యాయిని రాష్ట్ర ప్రజలందరు గమనిస్తున్నారని అన్నారు.జీఎస్డీపీ, తలసరి ఆదాయంలో జీఎస్టీ వనూళ్లలో దేశానికే తలమానికంగా నిలిచిన ఒకప్పటి తెలంగాణ ఇప్పుడు వెలవెలబోతున్నది. చేతిలో పైసల్లేక ప్రజల కొనుగోలు శక్తి అధఃపాతాళానికి పడిపోయిందన్నారు.మొత్తంగా రాష్ట్ర ఆర్థికరంగం అతలాకుతలమయ్యింది. అందుకే, తెలంగాణలో ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వంతో పోల్చితే గత కేసీఆర్‌ పాలనే బాగున్నదని అన్నారు.ప్రజలు ముమ్మాటికి కేసీఆర్ పాలనే కోరుకుంటన్నారని అన్నారు. 15 నెలల పాలన లోనే రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడి పోయిందన్నారు. ప్రజలందరు ఏకమై మరలా టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో శంషాబాద్ మండల మాజీ ఎంపీపీ దుద్యాల జయమ్మ శ్రీనివాస్, శంషాబాద్ మండల టిఆర్ఎస్ అధ్యక్షులు మాచర్ల మోహన్ రావు, పిఎసిఎస్ చైర్మన్ బూర్కుంట సతీష్, పలువురు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Error on ReusableComponentWidget

Latest News

ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దాం. జడ్పి  సీఇఓ శైలజ ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దాం. జడ్పి  సీఇఓ శైలజ
నమస్తే భారత్  /  నారాయణపేట జిల్లా : ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి అంకితభావంతో కృషి చేద్దామని సీ ఇ ఓ శైలజ అన్నారు నారాయణపేట జిల్లా  కేంద్రంలో...
తిప్రాస్ పల్లిలో ఘనంగా ప్రాథమికోన్నత పాఠశాల వార్షికోత్సవం
పెద్దముప్పారం సాంఘిక సంక్షేమశాఖ ( హస్టల్ ) ఎత్తివేత కారణం హాస్టల్ వార్డెన్ అధికారులే.నీరుడుసామేలు
పదోన్నతి ఉత్సాహంతో పాటు మరింత బాధ్యత పెంచుతుంది: జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ ఐపియస్
రాజీవ్ యువవికాసం దరఖాస్తుల పరిశీలన పకడ్బందీగా చేసి అర్హులను ఎంపిక చేయాలి. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్
వరి కొనుగోలు కేంద్రాలను సందర్శించిన జిల్లా వ్యవసాయ అధికారి 
రైతాంగానికి గోదావరి జలాలు ఇవ్వాలి