నిజాయితీగా జీవించడమే నిజమైన దైవ భక్తి
* పివికే 5 ఇంక్లైన్ గని మేనేజర్ శ్యాం ప్రసాద్
నమస్తే భారత్/భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో: పండుగలు మనిషిని మనిషిగా మానవతా విలువలు కలిగిన మంచి వాడిగా ఉండేందుకే శిక్షణ ఇస్తాయని కొత్తగూడెం సింగరేణి కాలరీస్ పివికే పై ఇంక్లైన్ గాని మేనేజర్ శ్యాం ప్రసాద్ అన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా మంగళవారం గనిలో జరిగిన "ఈద్ మిలాఫ్ " కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా అందరూ కలిసి పండుగలు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. జమాతే ఇస్లామి హింద్ సభ్యులు షేక్ అబ్దుల్ బాసిత్ ముఖ్య వక్తగా హాజరయ్యి మాట్లాడుతూ రంజాన్ ఉపవాసాలు ఆకలి అంటే ఏమిటో ఆచరణాత్మకంగా తెలుసుకుని ఆకలితో అల్లాడే పేదవారికి సహాయం చెసే గుణాన్ని అలవర్చుకునేలా చేస్తాయని అన్నారు. తల్లిదండ్రుల పట్ల మంచితనంతో వ్యవహరించాలని బంధువులతో ఇరుగు పొరుగు వారితో సత్సంబంధాలు కలిగి ఉండటమే నిజమైన ఆరాధన అని అన్నారు.కార్మిక సంఘాల నాయకులు మల్లికార్జున్, రజాక్ మాట్లాడుతూ కులమత భేదం భావం లేకుండా అందరూ కలిసి అన్ని పండుగలను జరుపుకునే సంప్రదాయం కేవలం కొత్తగూడెం ఏరియాలోనే ఉండటం గర్వకారణం అని అన్నారు. సినీయర్ ఇంజినీర్ నజీర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సేఫ్టీ ఆఫీసర్ కీషోర్ వెల్ఫర్ఆ ఫీసర్ హరీష్, షకీల్, ఇంజనీర్లు శ్రీనివాస్, కార్మిక సంఘాల నాయకులు గట్టయ్య, రాజయ్య, వీరాస్వామి, హుమాయున్, అంజనేయులు, వీరభద్రం, ఆసీఫ్, ఈద్ మిలాఫ్ కమిటీ సభ్యులు రఫీ, జానీ, ఖాజా పాషా, రబ్బానీ, అతర్ అలి, అక్బర్, సమీర్, మనోహర్, సలీం ఉమర్ తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
