సిపిఐ కార్యాలయంలో మహో పాద్వాయుడు రష్యా విప్లవ కారుడు కామ్రేడ్ లెనిన్ 155వ జయంతి వేడుకలు
సిపిఐ అశ్వాపురం మండల కార్యదర్శి అనంతనేని సురేష్
నమస్తే భారత్: అశ్వాపురం : అశ్వాపురం సిపిఐ కార్యాలయం నందు, రష్యా విప్లవకారుడు కామ్రేడ్ లెనిన్ 155వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించిన, సిపిఐ మండల కార్యదర్శి అంతనేని సురేష్, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉండగా సామ్రాజ్యవాదాన్ని పెట్టుబడిదారీ విధానపు అత్యున్నత దశగా, పతన దశగా, ఒక మట్టి కాళ్ళ మహా రాక్షసిగా లెనిన్ విశ్లేషించారు. మొదటి ప్రపంచ యుద్ధానికి వ్యతిరేకంగా రష్యా ప్రజలను నిలిపి 1917 అక్టోబరు విప్లవంతో (నవంబర్ 7) జారు చక్రవర్తుల నిరంకుశ పాలనను ఓడించి సామ్రాజ్యవాదాన్ని సంపూర్ణంగా కూలద్రోసే పోరాట బావుటాను యావత్తు ప్రపంచం ముందు లెనిన్ ఆవిష్కరించాడు. ఇప్పుడు పెట్టుబడికి కూడా యుద్ధాన్ని అదుపులో పెట్టడం అసాధ్యమైంది!" (మయకోవస్కి) అదనపు విలువ కన్నపు దొంగల్ని కన్నంలోనే" కార్ల్ మార్క్స్ పట్టుకుంటే జాతీయ విముక్తి పోరాటాలే, ముఖ్యంగా ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా ఖండాలలోని సామ్రాజ్యవాద పీడిత దేశాల ప్రజలు విప్లవించడం ద్వారానే యుద్ధాలకి శాశ్వత పరిష్కారం లభిస్తుందని, ప్రపంచ శాంతి ఏర్పడుతుందని మనకు చెప్పిన వాడు లెనిన్ ప్రసిద్ధ కవి మయకోవస్కి మాటల్లో చెప్పాలంటే "లెనిన్ బ్రతుకు జనం కొరకు!" "లెనిన్ నేడు లేడూ! చూడు జనంలో ఉన్నాడు. భారతదేశాన్ని తమ ప్రత్యక్ష వలసగా మార్చుకుని బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఆర్థిక రాజకీయ దోపిడీ అణిచివేతలకు పాల్పడినప్పుడు, అత్యంత సహజంగా భారత జాతీయ నాయకులు సోవియట్ విప్లవం వైపు దాని ఆదర్శాల వైపు చూశారు. ప్రపంచమంతా భూఖండమంతా ఆయనకేసి చూస్తోంది. ప్రతి చోట నుంచీ చైనా నుంచీ, ఇండియా నుంచీ, అమెరికా నుంచీ జీవనాడులు ఆయన్ను పెనవేసుకుని ఉన్నాయి. ఆయన ఆత్మ శాశ్వతంగా అందరికీ చెoదుతుంది. ప్రపంచ బ్రిటిష్ సామ్రాజ్యవాదులు లెనిన్ పై దుష్ప్రచారం చేస్తుండటాన్ని ఖండిస్తూ బాలగంగాధర తిలక్ తన 'కేసరి'పత్రికలో 1918 జనవరి లోనే "రష్యా నాయకుడు లెనిన్!" అనే సంపాదకీయంలో లెనిన్ ను శాంతికాముకునిగా కీర్తించాడు. "అగ్ర రాజ్యాలు తమ స్వార్ధ ప్రయోజనాలకై యుద్ధాలను రెచ్చగొడుతూ ఉంటే లెనిన్ వాటిని వ్యతిరేకించాడని"అభినందించాడు. అంతేకాక "పేద రైతాంగానికి భూమిని పంచిపెట్టటానికి సంకల్పించడం, పేదలను ఉద్ధరించే గొప్ప విప్లవాత్మక చర్యగా" తిలక్ పేర్కొన్నాడు. ఈయనే కాక వివిధ సందర్భాలలో లాలాజపతిరాయ్, గాంధీ, సుభాష్ చంద్రబోస్ తదితరులు తమ తమ పద్ధతులలో లెనిన్ ను శ్లాఘిoచారు. సావర్కారు బ్రిటిష్ వాళ్లకు లొంగిపోవటానికి ముందు లండన్ లో ఉండగా లెనిన్ ను ఇండియా హౌస్ లో కలిశాడు. ఉత్తర ప్రదేశ్ లో మధుర ప్రాంతానికి చెందిన రాజా మహేంద్ర ప్రతాప్, బర్కతుల్లా, ఒబేదుల్లా సింధిలనే జాతీయ వీరులతో కలిసి మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో 1915లో ఆఫ్ఘనిస్తాన్ లో భారత ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, 1919 లో మాస్కో వెళ్లి స్వయంగా లెనిన్ ను కలిశారు. 1920లో శౌకత్ ఉస్మాని, ఎం.ఎన్ రాయ్ తదితరులు రష్యా వెళ్ళినప్పుడు లెనిన్ స్వయంగా వారిని స్వాగతించాడు. భగత్ సింగ్, సోవియటు విజయాలను శ్లాఘిస్తూ సందేశం పంపిన సంగతి మనకు బాగా తెలుసు. ఆ విధంగా లెనిన్ స్ఫూర్తితో మొత్తంగా ఆసియా ప్రజలకు ప్రత్యేకించి భారత జాతీయ నాయకత్వానికి విడదీయరాని బంధం ఉంది అని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి, ఈనపల్లి పవన్ సాయి, ఏఐఎస్ఎఫ్ పినపాక నియోజకవర్గం కార్యదర్శి, అక్కనపల్లి నాగేంద్రబాబు,సిపిఐ మండల నాయకులు, నారాయణ, రామ్మూర్తి, రఘు, రాము, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

