ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన వెంకటేశ్వర ఒకేషనల్ జూనియర్ కళాశాల
అత్యుత్తమ ఫలితాలు సాధించడం పై స్థానికంగా హర్షం
నమస్తే భారత్ :-తొర్రూరు : ఇంటర్ ఫలితాల్లో స్థానిక శ్రీ వెంకటేశ్వర ఒకేషనల్ జూనియర్ కళాశాల సత్తా చాటింది. ప్రధమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఎమ్మెల్టి ప్రథమ సంవత్సరంలో గాయాల సౌమ్య 483/500 మార్కులు సాధించగా, ఎం పి హెచ్ డబ్ల్యు ఫస్ట్ ఇయర్ లో మిడతపల్లి రమ 473 , ద్వితీయ సంవత్సరంలో బాధావత్ మమత 920 మార్కులు సాధించారు. ఎమ్మెల్టీ ప్రథమ సంవత్సరంలో వల్లాల వర్షిత 462, ద్వితీయ సంవత్సరంలో జలగం అశ్విని 809, ఎంపీహెచ్ డబ్ల్యూ ప్రధమ సంవత్సరంలో బాధావతు అనూష 449, ఇస్లావత్ అనూష 436, బానోతు రాజేశ్వరి 435, బానోతు నందిని 429, రమావత్ మౌనిక 429 మార్కులు సాధించారు. ద్వితీయ సంవత్సరంలో బాదావత్ మమత 920, హెచ్చు వైష్ణవి 900, శివరాత్రి స్రవంతి 889, జెల్ల భవ్య శ్రీ 885 మార్కులతో సత్తా చాటారు. ఈటి ద్వితీయ సంవత్సరంలో తలారి చరణ్ 808 మార్కులు సాధించారు. ఓవరాల్ గా కళాశాల 87 శాతం ఉత్తీర్ణత సాధించి ఉత్తమంగా నిలిచింది.విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడం పట్ల కళాశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. విద్యార్థులను కళాశాల మేనేజ్మెంట్ ప్రిన్సిపాల్ జాటోత్ రమేష్, వైస్ ప్రిన్సిపాల్ అశోక్, డైరెక్టర్లు మచ్చ సాగర్, భూక్యా శ్రీను లు అభినందించింది.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

