ఉస్మానియా యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల అరెస్టులను ఖండిస్తున్నాం, సిపిఎం మండల కార్యదర్శి సత్ర పల్లి సాంబశివరావు
నమస్తే భారత్: మణుగూరు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన సుమారు 400 ఎకరాల భూములను తెలంగాణ ప్రభుత్వం అమ్ముకోవాలని చేస్తున్న ప్రయత్నాలను నిరసిస్తూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై అమానుషంగా దాడులు చేయడాన్ని, విద్యార్థుల అరెస్టులను సిపిఎం మండల కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. బేషరతుగా విద్యార్థి నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి సత్ర పల్లి సాంబశివరావు మాట్లాడుతూ వర్సిటీ భూములు విద్యా అవసరాలకు మాత్రమే వినియోగించాలని ఉద్యమిస్తున్న విద్యార్థులను పోలీసు యంత్రాంగంతో అణిచివేయాలని చూడడం కాంగ్రెస్ ప్రభుత్వ అవివేకమని అన్నారు. విద్యా సంస్థల భూములు విద్యార్థుల విద్యా సంబంధ అవసరాలు తీర్చడానికి మాత్రమే కేటాయించారని అన్నారు. ప్రభుత్వాలకు ఆదాయం లేకపోతే భూములు అమ్ముకోవాలని భావించడం అవివేకమైన చర్య అని స్పష్టం చేశారు. దేశ భవిష్యత్ ను నిర్మించే శాస్త్రవేత్తలు, మేధావులు, మానవ వనరులను, పౌరులను అందించే వర్సిటీ భూములను అమ్ముకొని ప్రభుత్వం నడపాలని చూడటం దారుణమని అన్నారు. పార్టీ అగ్ర నేతలు, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్ముకోవాలని చేస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ తీరు పై స్పందించాలని కోరారు. విద్యార్థులను అందులోనూ మహిళా విద్యార్థులను అమానుషంగా ఈడ్చుకెళ్తూ అరెస్టులు చేస్తున్న విధానాన్ని ఆయన స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. వర్సిటీ భూములు అమ్ముకోవాలని చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వ అంశంలో తన స్టాండ్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు చేస్తున్న న్యాయమైన పోరాటానికి మద్దతు తెలుపుతోందని తెలిపారు. అరెస్టు చేసిన విద్యార్థులను బేషరతుగా విడుదల చేయాలని, వర్సిటీ భూములను గుంజుకోవాలనే ప్రభుత్వ నిర్ణయం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
