పదవ తరగతి  వార్షిక పరీక్ష కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపిఎస్

పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు ,  పరీక్షా కేంద్రాల వద్ద 163 BNSS-2023 అమలు

పదవ తరగతి  వార్షిక పరీక్ష కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపిఎస్

నమస్తే భరత్   సిద్దిపేట : పట్టణంలో ఉన్న పదవ తరగతి వార్షిక పరీక్ష కేంద్రాలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఎస్ ఆర్ కే టెక్నో స్కూల్ తదితర పరీక్ష కేంద్రాలను పరిశీలించి పరీక్షలు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. బందోబస్తు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులకు సిబ్బందికి పటిష్టమైన బందోబస్తు గురించి తగు సూచనలు సలహాలు చేశారు.  ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మేడమ్ గారు మాట్లాడుతూ పదవ తరగతి వార్షిక పరీక్షల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా  79 పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పరీక్షలు జరిగే సమయంలో సిబ్బంది అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరీక్షా కేంద్రాలకు పేపరు వచ్చేటప్పుడు తీసుకొని వెళ్లేటప్పుడు తప్పకుండా ఎస్కార్ట్ ఉండాలని సూచించారు. పరీక్షలు జరిగే సమయంలో అధికారులు పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్, టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్, పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:
Error on ReusableComponentWidget

Latest News

జిల్లా కేంద్రంలో "రాజ్యాంగ నిర్మాతకు 134వ జయంతి సందర్భంగా ఘనమైన నివాళులు. జిల్లా కేంద్రంలో "రాజ్యాంగ నిర్మాతకు 134వ జయంతి సందర్భంగా ఘనమైన నివాళులు.
తేదీ, ఏప్రిల్ 14, 2025నమస్తే భరత్ నిర్మల్ జిల్లా కేంద్రంలో సోమవారం భారతరత్న, రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ, జయంతి వేడుకలు జిల్లా కేంద్రంలోని...
అఖిల భారత ప్రగతి శీల విద్యార్థి సంఘం.134 వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది
గొప్ప సామాజిక సంస్కర్త, రాజనీతిజ్ఞుడు, ఆర్థిక వేత్త, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  
భారతరత్న డా.బి.ఆర్. అంబేడ్కర్‌ ఆశయాలను.. కొనసాగిద్దాం 
అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం 
భావితరాలకు ఆదర్శప్రాయుడు బిఆర్‌. అంబేద్కర్‌ న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ మాస్టర్ అహ్మద్ ఖాన్
సిపిఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు