ప్రశాంత్ హౌస్ అరెస్ట్ అని తెలియగానే ఇంటికి కదిలిన బీసీ సైన్యం…
హెచ్ సి యు400 ఎకరాలు అమ్ముతారు ప్రశ్నిస్తే హౌస్ అరెస్ట్ చేస్తారా?
నమస్తే భారత్ షాద్ నగర్ : బీసీ హక్కుల కోసం పోరాడే గొంతుకలను అణచివేయాలని చూస్తే, బీసీ సేన గుండె చల్లబడదు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ( హెచ్ సి యు) లో 400 ఎకరాల భూమిని అమ్ముతూ, దీనిపై ప్రశ్నించే వారిని హౌస్ అరెస్ట్ చేయడం అప్రజా స్వామిక చర్య. ప్రజా హక్కుల కోసం నిలబడి పోరాడే బీసీ సేన రంగా రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు పసుపుల ప్రశాంత్ ముదిరాజ్ ని అరెస్టు చేయడం దౌర్జన్య చర్యగా ఖండిస్తున్నాం! ఈ అరాచకానికి నిరసనగా, బీసీ సేన నాయకులు జిల్లా యువజన కార్యదర్శి దేశమోని శివ ముదిరాజ్ నాయకత్వంలో పసుపుల ప్రశాంత్ ముదిరాజ్ ఇంటికి చేరుకుని పరామర్శిం చారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు బీసీ సేన అసెంబ్లీ అధ్యక్షులు కత్తి చంద్ర శేఖరప్ప, షాద్నగర్ అసెంబ్లీ అధ్యక్షురాలు బాస వరలక్ష్మి,మేకల వెంకటేష్, చందూలాల్, పసుపులసత్యం,సురేందర్గౌడ్,సాయికుమార్,మల్కాపురంరవి,నరసింహులు,బాలరాజ్,సౌజన్య,బాలమణి,కురుమయ్య తదితరులు పాల్గొన్నారు బీసీ హక్కుల కోసం నిలబడి పోరాడేవాళ్లను అరెస్టులు చేసి అణచివేయాలనుకుంటే, అలా జరగదు! బీసీ సేన శక్తిగా ప్రతిస్పందిస్తుంది. ప్రజా ఆస్తుల అమ్మకాలపై నిప్పులు కక్కి ప్రశ్నిస్తూనే ఉంటుంది.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
