ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా భూగర్భ జల శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం.
నమస్తే భారత్
నిర్మల్ :-జిల్లా శనివారం కడెం మండల కేంద్రంలోని రైతు వేదికలో మార్చి 22 అంతర్జాతీయ జల దినోత్సవం సందర్భంగా మండల రైతులకు, మహిళ సమాఖ్య సభ్యులకు నీటి పొదుపు, నిత్యజీవితంలో నీటి ప్రాముఖ్యత, ఇంకుడు గుంతలు, తదితర అంశాలపై భూగర్భ జల శాఖ అధికారులు అవల్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా భూగర్భ జల శాఖ అధికారి పి. శ్రీనివాస బాబు మాట్లాడుతూ, నీరు లేకుంటే మానవ మనుగడ సాధ్యం కాదని, మనుషులకే కాకుండా జీవులన్నింటికీ నీరు చాలా అవసరమని తెలిపారు. ప్రతి ఒక్కరు బాధ్యతగా నీటిని వృధా చేయకుండా పొదుపు చేయాలన్నారు. ఎన్నో దేశాలు నీరు దొరకక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని. నీటిని పొదుపు చేయడం ద్వారా భావితరాలకు నీటిని అందించిన వారమవుతామని తెలిపారు. అనంతరం డిఆర్డిఓ విజయలక్ష్మి మాట్లాడుతూ, ప్రతి ఇంటికి ఒక ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకోవడం ద్వారా వర్షపు నీరు, నిత్యవసరాలకు వినియోగించిన నీరు ఇంకుడు గుంతలలో ఇంకి భూగర్భ జలాలు వృద్ది చెందుతాయి అన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఇంకుడు గుంటల నిర్మాణం చేపట్టాలన్నారు. ఆదర్శ రైతులు మల్లేష్, రాజమల్లు, బైరి గంగరాజు, లను అధికారులు శాలువాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ అరుణ, మండల వ్యవసాయ అధికారి దినేష్, ఉద్యానవన అధికారి స్పందన, ఈజీఎస్ హెచ్ఆర్ సుధాకర్ , మిషన్ భగీరథ ఏఈఈ అభిలాష్, నీటిపారుదల ఏఈఈ విశాల్, మండల పంచాయతీ రాజ్ అధికారి కవిరాజ్, రైతులు, మహిళా సమాఖ్య సంఘ సభ్యులు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
