వయోధికుల పోషణ మరియు సంక్షేమ చట్టం 2007 వయోవృద్ధుల రక్షణకు ఉన్న చట్టాలకు సంబంధించిన ఫ్లెక్సీలను కమిషనర్ కార్యాలయంలో ఆవిష్కరించిన సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను         

వయోధికుల పోషణ మరియు సంక్షేమ చట్టం 2007 వయోవృద్ధుల రక్షణకు ఉన్న చట్టాలకు సంబంధించిన ఫ్లెక్సీలను కమిషనర్ కార్యాలయంలో ఆవిష్కరించిన సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను         

     నమస్తే భారత్: సిద్దిపేట : తెలంగాణ స్టేట్ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సిద్దిపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో తల్లిదండ్రులు మరియు వయోధికుల పోషణ మరియు సంక్షేమ చట్టం 2007 వయోవృద్ధుల రక్షణకు ఉన్న చట్టాలకు సంబంధించిన ఫ్లెక్సీలను కమిషనర్ కార్యాలయంలో ఆవిష్కరించిన సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను, దుబ్బాక సీఐ శ్రీనివాస్, సంబంధిత సర్కిల్ ఎస్ఐలుఈ సందర్భంగా సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను మాట్లాడుతూ * పోలీస్ కమిషనర్ మేడమ్ గారి ఆదేశానుసారం  వయోవృద్ధులకు సంబంధించిన చట్టాల గురించి ఏర్పాటు ఫ్లెక్సీలను ఆవిష్కరించడం జరిగిందని తెలిపారు. ఎవరైనా సరే తల్లిదండ్రులను వయోవృద్ధులను పోషించకుంటే  చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కన్న తల్లిదండ్రులను పోషించవలసిన బాధ్యత  కన్న కొడుకులు మరియు కూతుర్లపై  ఉంటుందన్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను జీవితంలో మరవకూడదని తెలిపారు. వాళ్లు మనకు జన్మనిచ్చారు కాబట్టి మనం ఈరోజు  ఈ సమాజంలో ఒక విలువలతో బతకడం జరుగుతుందన్నారు. తల్లిదండ్రులను దైవ స్వరూపులు వారిని బాధపెట్టకూడదు, తల్లిదండ్రులు కంటతడి పెడితే పిల్లలకు శాపం తగులుతుందని తెలిపారు. ఎవరైనా వారి పిల్లలు తల్లిదండ్రులను సరిగా చూడకపోతే ఆ తల్లిదండ్రులు నేరుగా పోలీస్ స్టేషన్కు వచ్చి  దరఖాస్తు ఇచ్చినచో వారి పిల్లలను పిలిపించి  కౌన్సిలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. వారు వినని పక్షంలో 2007 చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కే రమేష్, టాస్క్ జిల్లా అధ్యక్షులు, రాయపోల్ నర్సయ్య టాస్క్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డాక్టర్ ఎస్ భూమయ్య టాస్క్ జిల్లా ప్రధాన కార్యదర్శి. మరియు రిటైర్డ్ టీచర్లు  తదితరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మొదలుపెట్టని పూడికతీత పనులు.. మురికి కూపంగా మారిన నాలాలు.. డ్రైనేజీలు మొదలుపెట్టని పూడికతీత పనులు.. మురికి కూపంగా మారిన నాలాలు.. డ్రైనేజీలు
ఎల్బీనగర్‌, ఏప్రిల్‌ 8 : ఎల్బీనగర్‌ జోన్‌లో పూడికతీత పనులు ప్రారంభం కాలేదు. హయత్‌నగర్‌, ఎల్బీనగర్‌, సరూర్‌నగర్‌ సర్కిళ్ల పరిధిలోని చాలా ప్రాంతాల్లో డ్రైన్లు, నాలాలు పూడుకుపోయాయి....
షార్ట్‌ సర్క్యూట్‌తో దగ్ధమైన దుకాణాలను ప్రజాట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్మిస్తా
మధిరలో పూర్తైన‌ వంద పడకల హాస్పిటల్‌ను ప్రారంభించాలి : ఏలూరి నాగేశ్వర్‌రావు
కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాలుగా రేషన్‌ దుకాణాలు : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
గర్భిణుల‌కు పోష‌కాహారం అందించాలి : సీడీపీఓ లక్ష్మి ప్రసన్న
వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ చ‌ట్టం అమ‌లుపై సీఎం మ‌మ‌త సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌
పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని సీపీఎం నిరసన