పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థిని, విద్యార్థులకు  తగిన సౌకర్యాలు కల్పించాలి

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృశ్య ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మౌలిక వసతులు తగిన ఏర్పాట్లను చేయాలి

పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థిని, విద్యార్థులకు  తగిన సౌకర్యాలు కల్పించాలి

నమస్తే భారత్ :-మరిపెడ  : గురువారం జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్, మరిపెడ మండలం  సూర్యాపేట రోడ్డులో గల కేజీవిబీ వసతి గృహం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు,
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతి గృహంలో పాఠశాలలలో తగిన సౌకర్యాలు కల్పిస్తూ రుచికరమైన నాణ్యమైన ఆహారాన్ని అందించాలని, డైట్ మెనూ పక్కాగా పాటించాలని, సూచించారు,రాష్ట్రస్థాయిలో జిల్లాను అత్యుత్తమ ఫలితాలను సాధించుటకు గత కొన్ని రోజుల నుండి ప్రణాళికా ప్రకారం విద్యాశాఖ ముందుకు వెళ్లిందని అందుకు అనుకూలంగా చర్యలు తీసుకొని ప్రతీ సబ్జెక్టు వారీగా విద్యాబోధనలు అందించడం జరిగిందని అన్నారు, రానున్న పదవ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని విద్యార్థులకు సూచించారు, వసతి గృహం లోని కిచెన్ షెడ్డు, తరగతి గదులను పరిసరాలను పరిశీలించారు, భోజనం సిద్ధం చేసే వారు తగిన జాగ్రత్తలు పాటిస్తూ భోజనం వడ్డించాలని సూచించారు, అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను తనిఖీ చేసి ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృశ్య కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సబ్ సెంటర్లవారీగా తగిన మందులు ఓఆర్ఎస్ సిద్ధంగా ఉంచుకోవాలని ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చిన వెంటనే స్పందించాలని, తీవ్రమైన ఎండల నేపథ్యంలో తీసుకోవలసిన జాగ్రత్తలను గ్రామపంచాయతీలు మున్సిపల్ వారిగా విస్తృత ప్రచారం చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు,  మందుల స్టాక్ రిజిస్టర్, హాజరు వివరాలను, ఇన్ పేషెంట్, ఔట్ పేషెంట్ వివరాలను తనిఖీ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు,

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మొదలుపెట్టని పూడికతీత పనులు.. మురికి కూపంగా మారిన నాలాలు.. డ్రైనేజీలు మొదలుపెట్టని పూడికతీత పనులు.. మురికి కూపంగా మారిన నాలాలు.. డ్రైనేజీలు
ఎల్బీనగర్‌, ఏప్రిల్‌ 8 : ఎల్బీనగర్‌ జోన్‌లో పూడికతీత పనులు ప్రారంభం కాలేదు. హయత్‌నగర్‌, ఎల్బీనగర్‌, సరూర్‌నగర్‌ సర్కిళ్ల పరిధిలోని చాలా ప్రాంతాల్లో డ్రైన్లు, నాలాలు పూడుకుపోయాయి....
షార్ట్‌ సర్క్యూట్‌తో దగ్ధమైన దుకాణాలను ప్రజాట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్మిస్తా
మధిరలో పూర్తైన‌ వంద పడకల హాస్పిటల్‌ను ప్రారంభించాలి : ఏలూరి నాగేశ్వర్‌రావు
కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాలుగా రేషన్‌ దుకాణాలు : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
గర్భిణుల‌కు పోష‌కాహారం అందించాలి : సీడీపీఓ లక్ష్మి ప్రసన్న
వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ చ‌ట్టం అమ‌లుపై సీఎం మ‌మ‌త సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌
పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని సీపీఎం నిరసన