అసెంబ్లీలో రేవంత్‌ వ్యాఖ్యలపై ‘సుప్రీం’ ఆగ్రహం.. సీఎంను హెచ్చరించాలని న్యాయవాదికి సూచన.

అసెంబ్లీలో రేవంత్‌ వ్యాఖ్యలపై ‘సుప్రీం’ ఆగ్రహం.. సీఎంను హెచ్చరించాలని న్యాయవాదికి సూచన.

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీలో ఎవరు పార్టీ మారినా ఉప ఎన్నికలు రావు అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుపట్టింది. పార్టీ ఫిరాయింపులపై కేటీఆర్‌, పాడి కౌశిక్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం బుధవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీలోకి మారినా ఉప ఎన్నికలు రావంటూ అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటన చేసిన విషయం తెలిసిందే. విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది సుందరం సీఎం ప్రకటనను బెంచ్‌కు చదివి వినిపించారు.గౌరవనీయులైన స్పీకర్ సర్ తమరి ద్వారా నేను ఒకటి చెప్పదలుచుకున్న. ఎవరైతే సభ్యులున్నరో వాళ్లు ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఏ ఉపఎన్నికలూ రావు. వారు కోరుకున్నా ఉపఎన్నికలు రావు. అటోళ్లు ఇటొచ్చినా, ఇటోళ్లు అటుపోయినా ఉపఎన్నికలు రావు’ అంటూ వ్యాఖ్యానించిన విషయాన్ని ప్రస్తావించారు. దీనిపై జస్టిస్‌ గవాయ్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. సభలో ఇలా చెప్పి.. సీఎం పదో షెడ్యూల్‌ను అపహాస్యం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌, కార్యదర్శి తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి వాదనలు వినిపించారు. తాను సీఎం తరఫున హాజరుకాకపోవడంతో ఆ ప్రకటన గురించి వివరించలేకపోతున్నారని తెలిపారు. గతంలోనూ మరో కేసులో సీఎంని మందలించిన విషయాన్ని ధర్మాసనం గుర్తు చేసింది. 2024 ఆగస్టులో 2015 నాటికి ఓటుకు నోటు కేసు విచారణను బదిలీ చేయాలన్న పిటిషన్‌ను విచారణ సమయంలో జస్టిస్‌ గవాయ్‌ నేతృత్వంలోని బెంచ్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కే కవితకు కోర్టు బెయిల్‌ మంజూరు చేయడంపై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే. చట్టసభలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం.. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ని సీఎం స్థాయి హోదాలో ఉన్న అపహాస్యం చేయడం కిందకే వస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి వ్యాఖ్యలు మళ్లీ పునరావృతం కాకుండా సీఎంను హెచ్చరించాలని న్యాయవాది ముకుల్‌ రోహత్గికి సూచించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ తరహా వ్యాఖ్యలు ఉపేక్షించబోమని, అవసరమైతే కోర్టు ధిక్కారంగా భావించాల్సి వస్తుందని హెచ్చరించింది. తాము అన్ని ఆలోచించే కోర్టు ధిక్కార నోటీసులు ఇస్తున్నామని, అంతమాత్రాన మాకు అధికారాలు లేవని కాదని.. అసెంబ్లీలో రాజకీయ నేతలు చేసే ప్రకటనలకు పవిత్రత ఉంటుందని.. అసెంబ్లీలో మాట్లాడే అంశాలను సైతం కోర్టులో పరిగణలోకి తీసుకుంటామని ధర్మాసనం స్పష్టం చేసింది.

Views: 0

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కేతకి ఆలయ పాలక మండలి నియామకం.. ప్రమాణ స్వీకారానికి మంత్రులు, ఎంపీ కేతకి ఆలయ పాలక మండలి నియామకం.. ప్రమాణ స్వీకారానికి మంత్రులు, ఎంపీ
ఝరాసంగం, ఏప్రిల్ 4 : దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఝరాసంగం కేతకి సంగమేశ్వర స్వామి ఆలయ పాలక మండలిని నియమిస్తూ దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది....
మధ్యప్రదేశ్‌లో విషాదం.. బావిలో విషవాయువు పీల్చి ఎనిమిది మంది మృతి
బంగ్లాదేశ్ నేత యూనుస్‌తో ప్ర‌ధాని మోదీ భేటీ
న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలి.. హుజూర్‌నగర్‌ కోర్టులో విధులు బహిష్కరించిన లాయర్లు
మ‌రుగుజ్జుగా రామ్ చ‌ర‌ణ్‌.. ప్ర‌చారంలో నిజమెంత‌?
ట్రంప్‌ టారిఫ్‌ల ఎఫెక్ట్‌.. మరింత పెరగనున్న ఐఫోన్‌ ధరలు..?
వనమేధం లోగుట్టు.. గ్రోక్‌ రట్టు