జర్నలిస్టులకు ఉచితంగా ఇంటి స్థలం ఇవ్వాలి
- * అవసరమైతే జర్నలిస్టులతో కలిసి స్థలాన్ని ఆక్రమిస్తాం
- * సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు
- * జర్నలిస్టు ల నిరసన కార్యక్రమానికి సంఘీభావం తెలిపిన సిపిఎం
నమస్తే భారత్/భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో: జర్నలిస్టులకు ఎటువంటి షరతులు లేకుండా పూర్తిగా ఉచితంగానే ఇండ్ల స్థలం ఇవ్వాలని అవసరమైతే జర్నలిస్టులతో కలిసి స్థలాన్ని ఆక్రమిస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు అన్నారు. కొత్తగూడెం మున్సిపల్ పరిధిలోని గంగాబిషన్ వస్తే ఏరియాలో జర్నలిస్టులో కేటాయించిన స్థలం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్న జర్నలిస్టుల టెంటు వద్దకు శుక్రవారం సిపిఎం నేతలు వెళ్లి సంఘీభావం తెలిపారు. అనంతరం మచ్చ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పాలక ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు ఉచితంగా వేలాది ఎకరాలు ఇస్తున్నాయి కానీ ప్రజలు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేసే జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలు ఇవ్వకపోగా ఇచ్చిన స్థలాన్ని కూడా కేటాయించడంలో మీనమేషాలు లెక్కిస్తుందని అన్నారు. వారికి కేటాయించిన స్థలంలో జర్నలిస్టులు ఇలా రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేయడం దురదృష్టకరం అని అన్నారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన మీడియా ఈ రోజు న్యాయమైన డిమాండు కోరుతుంటే పట్టించుకోకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని లేని పక్షంలో జర్నలిస్టులతో కలిసి స్థలాన్ని అక్రమిస్తామని హెచ్చరించారు. భవిష్యత్తులో జర్నలిస్టులు చేపట్టబోయే ప్రతీ కార్యక్రమానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. నిరసన కార్యక్రమానికి సంఘీభావం తెలిపిన వారిలో సిపిఎం కొత్తగూడెం పట్టణ కార్యదర్శి లిక్కి బాలరాజు, జిల్లా నాయకులు భూక్యా రమేష్ తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

