ఢిల్లీలో కోట శివశంకర్
* ప్రజా సమస్యలపై కేంద్రమంత్రికి విన్నపం
నమస్తే భారత్/భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో: ప్రజా ఉద్యమ నాయకుడు సంఘ సేవకుడు
తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన కోట శివశంకర్ ఢిల్లీకి వెళ్లి మంగళవారం ప్రజా సమస్యలపై కేంద్రమంత్రికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. భారతదేశంలో మైనార్టీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యల పైన పార్లమెంట్లో చర్చించాలని సింగరేణిలో దివ్యాంగులకు బ్యాక్లాగ్ పోస్టులు ఏర్పాటు ప్రత్యేకమైన నోటిఫికేషన్ ఏర్పాటు చేయాలని పార్లమెంటులో కోషన్ అవర్ లో మాట్లాడాలని కోట శివశంకర్ కేంద్ర పార్లమెంటు వ్యవహారాల మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రి జిజుని మర్యాదపూర్వకంగా కలిసి విన్నవించడం జరిగింది. మైనార్టీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతోపాటు మైనార్టీ ప్రజలపై జరిగే దాడులను అరికట్టాలని కోరుతూ పార్లమెంట్లో ఒక చట్టం తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఇచ్చిన సమస్యలపై మంత్రి సానుకూలంగా స్పందించి సమస్యలపై పార్లమెంట్లో కచ్చితంగా చర్చిస్తానని హామీ ఇవ్వడం జరిగిందని తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కోట శివశంకర్ పేర్కొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

