వచ్చే నెల ఆరున జరిగే శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలి

భద్రాచలం ఆర్డీవో దామోదర్ రావు

వచ్చే నెల ఆరున జరిగే శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలి

నమస్తే భారత్: భద్రాచలం :వచ్చేనెల 06, 07వ తేదీలలో జరిగే శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం పట్టాభిషేకం మహోత్సవాలకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉన్నందున వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించడానికి స్వచ్ఛంద సంస్థలు అధికారులతో సహకరించాలని భద్రాచలం ఆర్డీవో దామోదర్ రావు అన్నారు  శనివారం నాడు సాయంత్రం సబ్ కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్ లో భద్రాచలంలో స్వచ్ఛంద సంస్థలు మరియు అధికారులతో భక్తులకు కల్పించవలసిన వసతి సౌకర్యాల గురించి ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఎండలు ముదురుతున్నందున భక్తులు ఎండ వేడిమిని సైతం లెక్కచేయకుండా స్వామివారి కళ్యాణం తిలకించడానికి తప్పకుండా కుటుంబ సభ్యులతో వస్తారని అందుకు ఆర్డబ్ల్యూఎస్ మరియు మిషన్ భగీరథ అధికారులు స్వచ్ఛమైన మంచినీరు మజ్జిగ పాకెట్లు సరఫరా చేస్తున్నారని అందుకు స్వచ్ఛంద సంస్థలు మీరు ఈ అధికారులకు సహకరించి మీ సంస్థ ద్వారా వాటర్ పాకెట్లు మజ్జిగ పాకెట్లు భక్తులందరికీ అందే విధంగా చూడాలని ఏ ఒక్క భక్తుడు అసౌకర్యాన్ని గురికాకుండా చూడవలసిన బాధ్యత మన పైన ఉన్నందున ఎక్కువ శాతం మీ స్వచ్ఛంద సంస్థ ద్వారా వాలంటీర్స్ ని నియమించి అందరికీ మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు అందించాలని ఆయన అన్నారు. భక్తులు కళ్యాణం తిలకించేటప్పుడు తప్పనిసరిగా సెక్టార్లలో కూడా మంచినీరు మజ్జిగ ప్యాకెట్లు అందేలా సంబంధిత స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు చొరవ చూపాలని అన్నారు. మజ్జిగ ప్యాకెట్లు మంచినీరు సరఫరా చేసే వాలంటీర్లకు ప్రతి సెక్టార్ కు వెళ్లడానికి గుర్తింపు కార్డులు అందిస్తామని, దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ భక్తులకు మన ఇంటి మనసులు లెక్క భావించి సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో  తాసిల్దార్ శ్రీనివాస్,స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు శ్రీనివాస్, విజయలక్ష్మి దామోదర్ రావు రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:
Error on ReusableComponentWidget

Latest News

నేటి నుంచి సిద్దేశ్వర స్వామి జాతర.. వాల్ పోస్టర్‌ ఆవిష్కరణ నేటి నుంచి సిద్దేశ్వర స్వామి జాతర.. వాల్ పోస్టర్‌ ఆవిష్కరణ
ఝరాసంగం, ఏప్రిల్ 10 : అతి పురాతనమైన పొట్టిపల్లి సిద్దేశ్వర స్వామి జాతర మహోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవాళ మండల పరిధిలోని బర్దిపూర్ దత్తగిరి...
బీహార్‌లో పిడుగుపాటుకు 21 మంది మృతి
నేను వేరే పెళ్లి చేసుకోవాల‌ని అనుకున్నా కాని.. ఎందుకు చేసుకోలేదంటే.. : రేణూ దేశాయ్
రెండంచెల భద్రత, బుల్లెట్‌ప్రూఫ్‌ వెహికల్‌, భద్రతగా స్వాత్‌ కమాండోస్‌.. తహవూర్‌ రాణాకు రాచమర్యాదలు
పెంచిన గ్యాస్, పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలి: సీపీఎం
మొదలుపెట్టని పూడికతీత పనులు.. మురికి కూపంగా మారిన నాలాలు.. డ్రైనేజీలు
షార్ట్‌ సర్క్యూట్‌తో దగ్ధమైన దుకాణాలను ప్రజాట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్మిస్తా