రంజాన్ తోఫాను అందించడం ఆదర్శనీయం
బీఆర్ఎస్ యువనాయకుడు వై. రవీందర్ యాదవ్
రంజాన్ పర్వ మాసాన్ని పురస్కరించుకొని బీఆర్ఎస్ నాయకులు చెర్క శివ సహకారంతో తోఫా పంపిణీ చేయడం పట్ల అభినందనలు
నమస్తే భారత్,షాద్ నగర్ : రంజాన్ పర్వ మాసాన్ని పురస్కరించుకొని షాద్ నగర్ మున్సిపాలిటీ 10 వ వార్డు బీఆర్ఎస్ అధ్యక్షుడు చెర్క శివ ముస్లిం సోదరులకు రంజాన్ తోఫాను ఇవ్వడం ఆదర్శనీయమని బీఆర్ఎస్ యువ నాయకుడు వై. రవీందర్ యాదవ్ అన్నారు. గురువారం షాద్ నగర్ పట్టణంలోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులకు రంజాన్ తోఫాను అందజేసిన అనంతరం మాట్లాడారు. ముస్లింల అత్యంత పవిత్ర మాసమైన రంజాన్ మాసంలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తే సకల శుభాలు కలుగుతాయని, అల్లా కృప వల్ల తెలంగాణ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. రంజాన్ మాసంలో తోటి ఇస్లాం మిత్రులకు దానధర్మాలు చేయడం ఆనవాయితని, తమకు తోచిన విధంగా సామాజిక సేవా కార్యక్రమాలలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. బీఆర్ఎస్ నాయకుడు శివ తోఫా పంపిణీకి ముందుకు రావడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఎం.ఎస్. నటరాజ్, నాయకులు యుగంధర్, పిల్లి శేఖర్, జూపల్లి శంకర్, చీపిరి రవి యాదవ్, మహమ్మద్ ఎజాజ్ (అడ్డు), చిన్న యాదగిరి, సాదిక్, బిలాల్, అష్రఫ్, అజహార్, నిజాం, మహమూద్, భిక్షపతి, సందీప్ సింగ్, రాఘవేందర్, పవన్ సింగ్, నవీన్ దుమ్మని, రహమత్ అలీ, వినోద్, సాయి యాదవ్, మంగ శ్రీశైలం, మల్లేష్, మధు, రాజశేఖర్, పాండు, మూర్తి, రఘు తదితరులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
