జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు
జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఐపియస్
నమస్తే భారత్ / నారాయణపేట్ జిల్లా : ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు, సమావేశాలు, బహిరంగ కార్యక్రమాలు, సభలు నిషేధం.శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా నారాయణపేట జిల్లా వ్యాప్తంగా ఈ నెల రోజుల పాటు "30 పోలీస్ ఆక్ట్" అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.30 పోలీస్ ఆక్ట్ ఏప్రిల్ 30 తేది వరకు అమల్లో ఉన్నందున జిల్లాలో పోలీసు అధికారుల అనుమతులు లేకుండా ఎలాంటి ర్యాలీలు, సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, ఫంక్షన్ హాల్లో కార్యక్రమాలు, బహిరంగ సభలు, ప్రజలు గుమ్మిగుడి ఉండే విధంగా కార్యక్రమాలు నిర్వహించడానికి సన్నాహాలు చేయరాదని తెలిపారు. అనుమతులు లేకుండా పై కార్యక్రమాలు నిర్వహించిన నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు. ప్రజా జీవనానికి ఇబ్బంది కలిగించేందుకు దారి తీసే సమావేశాలు, జన సమూహం చేయడం పూర్తిగా నిషేధమని తెలిపారు. సోషల్ మీడియా నందు అనవసరమైన విషయాలను, మతాల మధ్య చిచ్చు పెట్టే అంశాలను వ్యాప్తి చేసిన వారిపై కేసులను నమోదు చేయబడతాయని తెలిపారు. చట్టపరంగా జారీ చేసిన ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘించి నట్లయితే 30 పోలీస్ ఆక్ట్ ప్రకారం శిక్ష అర్హులవుతారని తెలిపారు. నిషేధం లో ఉన్న నిబంధనలు తప్పనిసరిగా అందరూ పాటించాలని ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్న ముందస్తు దరఖాస్తు చేసుకునే అనుమతులు తీసుకోవాలని ఎస్పి కోరారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

