ఆగిన మా జీతాలు ఇప్పించి, నూతనంగా మంజూరైన ఉద్యోగాల స్థానంలో మమ్మల్ని తీసుకోండి 

టైపిస్ట్- కమ్- కంప్యూటర్ ఆపరేటర్స్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు రెవిన్యూ శాఖ మహబూబాబాద్ జిల్లా

ఆగిన మా జీతాలు ఇప్పించి, నూతనంగా మంజూరైన ఉద్యోగాల స్థానంలో మమ్మల్ని తీసుకోండి 

నమస్తే భారత్ :-మహబూబాబాద్ :

జిల్లా కలెక్టర్ మహాబూబాబాబాద్ కి నమస్కరించి వ్రాయునది ఏమనగా
విషయం: మేము అనగా మన జిల్లా లోని వివిధ రెవిన్యూ కార్యాలయములో ఔట్ సోర్సింగ్ ద్వారా పనిచేసిన (13) మంది 'టైపిస్ట్-కమ్- కంప్యూటర్ ఆపరేటర్స్" లము, మాకు (15) నెలలుగా రావలసిన జీతభత్యాలు ఇప్పించుట గురించి మరియు మళ్ళీ సి.సి. ఎల్.ఎ, జి.ఓ. ప్రకారం కొత్తగా మంజూరైన ఉద్యోగాలలో మమ్ములను కొనసాగించాలి అని కలెక్టర్ కి వినతి పత్రం అందించడం జరిగింది.నిర్దేశం: ప్రిన్సిపల్ సెక్రటరీ, జి.ఓ. ఆర్.టి.నెం. 133, తేది: 06-03.2025 విషయం మహబూబాబాద్ జిల్లా రెవిన్యూ శాఖలో వివిద మండలములలోని రెవెన్యూ కార్యాలయములలో ఔట్ సోర్సింగ్ ద్వారా పనిచేసిన టైపిస్ట్- కమ్-కంప్యూటర్ ఆపరేటర్స్ సిబ్బందిమి, మమ్ములను నూతనంగా ఏర్పడిన మండలముల యందు "టైపిస్ట్- కమ్-కంప్యూటర్ ఆపరేటర్స్" గా ఔట్ సోర్సింగ్ ద్వారా నవంబర్ 2017 లో తీసుకున్నారు. అప్పటి నుండి (10) మాసములు అనగా డిసెంబర్ 2017 నుండి సెప్టెంబర్ 2018 వరకు జీతాలు సక్రమముగా ఇచ్చారు. కానీ ఆ తరువాత (15) మాసములుగా అనగా అక్టోబర్ 2018 నుండి డిసెంబర్ -2019 జీతాబత్యాలు  ఇవ్వలేదు. మా జీతాలకు సంబందించిన ఫైల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నందు అప్రూవల్ కాలేదు. మీరు ఇక మీదట అనగా 01-01-2020 నుంచి బడ్జెట్ ఫైల్ అప్పూవ్ అయ్యేదాకా ఆఫీస్ లకి రావద్దు అని ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా మాకు లేఖలను పంపించారు. మేము ఎన్నోసార్లు జిల్లా కలక్టర్ కి, గవర్నమెంట్ అధికారులకు మరియు మంత్రులకు విన్నవించుకున్నా ఇలాంటి ప్రయోజనం లేకపోయింది. మరియు ఈ నూతన సంవత్సరంలో రాష్ట్ర గవర్నమెంటు కొత్త ఉద్యోగాలు మంజూరు చేసిన సందర్భంగా పైనిర్దేశం ప్రకారం గా ప్రిన్సిపల్ సెక్రటరీ రాష్ట్రం లో (330) కంప్యూటర్ ఆపరేటర్ లు ఔట్సోర్సింగ్  పద్దతిలో మంజూరు చేసినారు. మన జీల్లాలో (10) కంప్యూటర్ ఆపరేటర్స్ పోస్టులు మంజురి అయినవి మిగితా జిల్లాలో మా స్థానంలోను ఉన్న వారికి పైన తెలిపిన జీవో ప్రకారం సీసీఎల్ఏ  కు పతిపాదనలు పంపిస్తున్నారు. కావున, తమరు స్పందించి మాకు కొత్తగా మంజూరి అయిన కంప్యూటర్ ఆపరేటర్ స్థానంలో తిరిగి ఉద్యోగాలను ఇప్పించట గురించి జీవో ప్రకారం సీసీఎల్ఏ కు పతిపాదనలు పంపించి మా కుటుంబాలను ఆదుకోగలరని మిమ్మల్ని కోరుతున్నాము.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:
Error on ReusableComponentWidget

Latest News

రెండంచెల భద్రత, బుల్లెట్‌ప్రూఫ్‌ వెహికల్‌, భద్రతగా స్వాత్‌ కమాండోస్‌.. తహవూర్‌ రాణాకు రాచమర్యాదలు రెండంచెల భద్రత, బుల్లెట్‌ప్రూఫ్‌ వెహికల్‌, భద్రతగా స్వాత్‌ కమాండోస్‌.. తహవూర్‌ రాణాకు రాచమర్యాదలు
ముంబై ఉగ్రదాడి కుట్రదారుల్లో ఒకడైన తహవూర్‌ రాణా ను అమెరికా ప్రభుత్వం భారత్‌కు అప్పగించిన విషయం తెలిసిందే. దీంతో అధికారులు ఆయన్ని భారత్‌కు తరలిస్తున్నారు. రాణాతో వస్తున్న...
పెంచిన గ్యాస్, పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలి: సీపీఎం
మొదలుపెట్టని పూడికతీత పనులు.. మురికి కూపంగా మారిన నాలాలు.. డ్రైనేజీలు
షార్ట్‌ సర్క్యూట్‌తో దగ్ధమైన దుకాణాలను ప్రజాట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్మిస్తా
మధిరలో పూర్తైన‌ వంద పడకల హాస్పిటల్‌ను ప్రారంభించాలి : ఏలూరి నాగేశ్వర్‌రావు
కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాలుగా రేషన్‌ దుకాణాలు : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
గర్భిణుల‌కు పోష‌కాహారం అందించాలి : సీడీపీఓ లక్ష్మి ప్రసన్న