మణుగూరు ఏరియా మనుగడ కాపాడాలి నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీ ప్రకటించాలి

ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పాయం సమక్షంలో సింగరేణి సీఎం డి ఎన్ బలరాం కి, జిఎం కోఆర్డినేషన్ ఎస్ డి ఎం సుభానికి వినతి పత్రాలు అందజేత 

మణుగూరు ఏరియా మనుగడ కాపాడాలి నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీ ప్రకటించాలి

నమస్తే భారత్: మణుగూరు : మణుగూరు ఏరియా మనుగడ కై మణుగూరు ఓసి విస్తరణ అడ్డంకులు తొలగించాలని  నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీ ప్రకటించాలని, సింగరేణి పరిరక్షణకు కొత్త గనులు ప్రారంభించాలని  కోరుతూ ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు సమక్షంలో వారి సహకారంతో  హైదరాబాద్ సింగరేణి భవన్ లో సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాం (ఐఆర్ఎస్)కి , జిఎం కోఆర్డినేషన్ సయ్యద్ మెహబూబ్ సుభానికి వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా  గోదావరిలోయ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి యస్ డి నా సర్ పాషా మాట్లాడుతూ... యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన మణుగూరు ఏరియా కొత్త బొగ్గు గనులు ప్రారంభించకపోవడం ఉన్న గనులకు విస్తరణ అనుమతులలో జాప్యం వెరసి మణుగూరు ఏరియా మనుగడనే ప్రశ్నార్థకంలో  పడిందన్నారు. నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీ ప్రకటించి  మణుగూరు ఓ సి విస్తరణకు అడ్డంకులు తొలగించాలని మరికొన్ని కొత్త గనులు ప్రారంభించాలని తద్వారా మణుగూరు పూర్వ వైభవం సంతరించుకోవడంతో పాటు మణుగూరు ఏరియా డిపెండెంట్ లకు కూడా ఇక్కడే పోస్టింగ్ ఇవ్వవచ్చని ఆయన అన్నారు. కోల్ ట్రాన్స్ పోర్ట్ రంగంలో  కూడా పరిస్థితి మెరుగుపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.అలాగే తెలంగాణ రాష్ట్రానికి వెన్నెముక దక్షిణాది పరిశ్రమలకు ఆయువుపట్టు సింగరేణి పరిరక్షణకు మరికొన్ని కొత్తగా ప్రారంభించాలని ఉన్న గనులకు విస్తరణ అనుమతులు సాధించాలని ఆయన ఎండి ని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఎండి సానుకూలంగా స్పందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా సింగరేణి కాంటాక్ట్ కార్మికుల వేతన పెంపుకు చర్యలు చేపట్టాలని కోరుతూ హైదరాబాద్ సింగరేణి భవన్ లో కలిసిన  రాష్ట్ర ప్రభుత్వ కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ (ఐ ఎన్ టి యు సి) రాష్ట్ర నాయకులు బి జనప్రసాద్ గారికి వినతిపత్రం అందజేశారు, ఈ సందర్భంగా శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టి యు జిల్లా నాయకులు మిడిదొడ్ల నాగేశ్వరరావు మణుగూరు ఏరియా లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులు ఎం సురేందర్ రెడ్డి,పి జయపాల్ రెడ్డి, అడపా స్వామి  (తాతబ్బాయి)తూపూడి గోవిందు తదితరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:
Error on ReusableComponentWidget

Latest News

నేటి నుంచి సిద్దేశ్వర స్వామి జాతర.. వాల్ పోస్టర్‌ ఆవిష్కరణ నేటి నుంచి సిద్దేశ్వర స్వామి జాతర.. వాల్ పోస్టర్‌ ఆవిష్కరణ
ఝరాసంగం, ఏప్రిల్ 10 : అతి పురాతనమైన పొట్టిపల్లి సిద్దేశ్వర స్వామి జాతర మహోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవాళ మండల పరిధిలోని బర్దిపూర్ దత్తగిరి...
బీహార్‌లో పిడుగుపాటుకు 21 మంది మృతి
నేను వేరే పెళ్లి చేసుకోవాల‌ని అనుకున్నా కాని.. ఎందుకు చేసుకోలేదంటే.. : రేణూ దేశాయ్
రెండంచెల భద్రత, బుల్లెట్‌ప్రూఫ్‌ వెహికల్‌, భద్రతగా స్వాత్‌ కమాండోస్‌.. తహవూర్‌ రాణాకు రాచమర్యాదలు
పెంచిన గ్యాస్, పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలి: సీపీఎం
మొదలుపెట్టని పూడికతీత పనులు.. మురికి కూపంగా మారిన నాలాలు.. డ్రైనేజీలు
షార్ట్‌ సర్క్యూట్‌తో దగ్ధమైన దుకాణాలను ప్రజాట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్మిస్తా