కాంగ్రెస్ రాకతోనే నిజమైన ప్రజాపాలన
రానున్నవి అన్నీ మంచి రోజులే.. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్..
నమస్తే భారత్,షాద్ నగర్ మార్చ్20 : మాదిగల హక్కులను కాలరాసే ప్రయత్నం చేశారు.. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని దగా చేశారు.. ఎవరి పాలయ్యిందిరో తెలంగాణ.. అని పాడుకునే పరిస్థితి తెచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ప్రజల పక్షాన నిలబడింది.. మాదిగల హక్కుల కోసం శాయ శక్తుల కృషి చేసింది.. దాని ఫలితమే వర్గీకరణ తీర్మానం.. ఇది చరిత్ర మరువని రోజు.. ఇకముందు ప్రతి మాదిగ అవుతాడు రారాజు.. అంటూ షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఉద్వేగంగా మాట్లాడారు. షాద్ నగర్ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొదటి నుంచి మాదిగలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గీకరణ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. దీనిని ఢిల్లీ ప్రభుత్వం ఆమోదించేదాకా వదిలేది లేదని స్పష్టం చేశారు. మాదిగల వర్గీకరణ అంశం కోసమే ఉద్యోగాల నియామకాలను కూడా ప్రభుత్వం ఆపిందని గుర్తు చేశారు. ఏబిసిడి వర్గీకరణ ద్వారా అట్టడుగు వర్గాల లో ఉన్న పలు కులాలకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వర్గీకరణకు చట్టబద్ధత కల్పించే దిశగా చేసిన ప్రయత్నం ఫలించిందని సంతోషం వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని మరోసారి రుజువు చేశామన్నారు. గతంలో వర్గీకరణ కోసం గ్రామ గ్రామాన ఉద్యమాలు జరిపినప్పటికీ బీఆర్ఎస్ సర్కారు స్పందించలేదన్నారు. కానీ గత ఎన్నికలకు ముందు చేవెళ్ల బహిరంగ సభ సాక్షిగా కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలు వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని ప్రకటించారని గుర్తు చేశారు. అందుకే కోర్టు తీర్పు వచ్చిన వెంటనే దీనిపై తీర్మానం చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకున్నారని పేర్కొన్నారు. తాను కూడా పలుమార్లు ఈ అంశాన్ని అసెంబ్లీలో చర్చించిన సంగతి ఎమ్మెల్యే ఈ సందర్భంగా గుర్తు చేశారు. మొత్తానికి ఈ వర్గీకరణ కాంగ్రెస్ చరిత్రలో ఒక శిలాశాసనంగా మిగిలిపోతుందని పేర్కొన్నారు. ఎస్సీ నాయకులు బాదేపల్లి సిద్ధార్థ, ఎర్రోళ్ల జగన్ వర్గీకరణ తీర్మానంపై తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ లకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రెస్ మీట్ కార్యక్రమంలో ఎస్సి సెల్ తాలూక నేతలు బాధేపల్లి సిద్దార్థ, కొమ్ము కృష్ణ, కేకే కృష్ణ, కర్రోల్ల సురేందర్, జాంగారి రవి, ఎరోళ్ళ జగన్,సింగపగ అనిల్ కుమార్, లింగరం యాదయ్య, కాంగ్రెస్ పార్టీ ఎస్సి నాయకులు మాజీ సర్పంచులు కొమ్ము కృష్ణ, జనిగె జగన్, ఈదుల పల్లి మాజీ సర్పంచ్ స్వామి, అప్పారెడ్డి గూడ మాజీ సర్పంచ్ చిన్నంతగారి మల్లేష్, గంట్లవెళ్లి యాధ య్య , బూర్గుల శివ కుమార్, మాజీ మార్కెట్ కమిటీ డైరక్టర్ లింగారం యాదయ్య,ఎస్సి సెల్ మండల అధ్యక్షులు నాగి సాయిలు, బోరిగే నరేందర్, అంతయ్య, జక్కని రవి, నేతలు ఎర్రగడ్డ పద్మారం అశోక్ , పథ్మారం నర్సింహులు,మాజీ ఎంపీటీసీ రజిత, నేతలు సింగ పాగ జంగయ్య, జాంగారి జంగయ్య, చిన్నంతగారి ప్రభు, చిన్నంతగారి కృష్ణ, ఎలికట్టమాజీ ఎంపీటీసీ శివ,బీమయ్య,దుర్గనీ శ్రీను, కావాలి యాదయ్య,ప్రసాద్, తోండ పల్లి దర్శన్ ,సింగపాగ రవి కుమార్,నోకియా, జంగయ్య, బాలరాజు, రాము, కృష్ణయ్య , బైరం పల్లి కృష్ణ, నర్సింహులు, రమేష్, దర్శన్ , బొరయ్య, వెంకటేష్, షాద్ నగర్ స్థానిక నేతలు బాబర్ అలీ ఖాన్, అగ్గనుర్ విశ్వం, చెంది తిరుపతి రెడ్డి, రఘు నాయక్,చల్ల శ్రీకాంత్ రెడ్డి, కృష్ణ రెడ్డి,బాలరాజు గౌడ్, కొంకల్ల చెన్నయ్య, జమ్రుత్ ఖాన్, ఆగ్గనుర్ బస్వం, దంగు శ్రీనివాస్ యాదవ్, ఇబ్రహీం, విజయ్ కుమార్ రెడ్డి, ముబరక్, డాకం మనీష్, మార్గం రాజేష్ , అనిల్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

