జర్నలిస్టుల సంక్షేమానికి పాటుపడింది కేసీఆర్ మాత్రమే

* ఇంటి స్థలం కేటాయించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే * జర్నలిస్టుల పోరాటానికి అండగా ఉంటాం * మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు * వంటావార్పు కార్యక్రమం విజయవంతం 

జర్నలిస్టుల సంక్షేమానికి పాటుపడింది కేసీఆర్ మాత్రమే

నమస్తే భారత్/భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో: జర్నలిస్టుల సంక్షేమానికి పాటుపడింది కేసీఆర్ మాత్రమేనని తమ ప్రభుత్వ హాయంలో జర్నలిస్టుల కొరకు స్థలం కేటాయించడం జరిగిందని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు అన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని గత కొద్ది రోజులుగా నిరసన కార్యక్రమం చేపడుతున్న దానిలో భాగంగా మంగళవారం బస్టాండ్ సెంటర్ వద్ద వంటావార్పు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి వనమా వెంకటేశ్వరరావు సంపూర్ణ మద్దతు తెలిపి ప్రసంగించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జర్నలిస్టుల కొరకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ పాత్రికేయుల సంక్షేమానికి ప్రత్యేక నిధులు కూడా కేటాయించినట్లు వివరించారు. కెసిఆర్ హయాంలోనే స్థానిక జర్నలిస్టులకు స్థలము ఇవ్వడం జరిగిందని ఇప్పుడున్న ప్రభుత్వం అట్టి స్థలాన్ని పంపిణీ చేయడంలో నిర్లక్ష్యం వహించడం జరుగుతుందని మండిపడ్డారు.  కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టుల న్యాయమైన కోరిక ఉచిత ఇంటి స్థలాలను వెంటనే  కేటాయించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు స్థలం కేటాయించకుంటే జర్నలిస్టులతో కలిసి ఉద్యమాన్ని  ఉధృతం  చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వనమా రాఘవేందర్, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్, మాజీ ఎంపీపీ బాదవత్ శాంతి, మండల అధ్యక్షులు కొట్టి వెంకటేశ్వర్లు, మాజీ ఉర్దూగర్ కమిటీ చైర్మన్ అన్వర్ పాషా, మాజీ కౌన్సిలర్ అంబుల వేణు, రుక్మాందర్ బండారి, వేముల ప్రసాద్, మాజీ కోఆప్షన్ సభ్యులు దూడల బుచ్చయ్య, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కొత్వాల సత్యం, సత్యనారాయణ (సంపు), అడ్వకేట్ సాదిక్, నవతన్, నాగబాబు, నిజం, శివ, జానీ, కరాటే శీను, మునిలా, తూంపూరు ప్రసాద్, వినోద్, తొగర రాజశేఖర్, దూడల కిరణ్, సురేందర్, ఆవు నూరి చంద్రయ్య, పల్లెపు రాజు బొమ్మిడి రమాకాంత్, బుందుగల శ్రీధర్, కొయ్యాడ శీను, లచ్చిరం, కంచర్ల రామారావు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళ నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పోలీస్ కుటుంబాలకు అండగా భద్రత స్కీమ్ పోలీస్ కుటుంబాలకు అండగా భద్రత స్కీమ్
  రోడ్డు ప్రమాదంలో మరణించిన కానిస్టేబుళ్లు పరంధాములు, వెంకటేష్ ఇరువురు కుటుంబాలకు పోలీస్ డిపార్ట్మెంట్ భద్రత నుండి వచ్చిన ఒక్కొక్క కుటుంబానికి 16 లక్షల రూపాయల మొత్తం
ఎడ్యుకేషన్ మెరిట్ ఎగ్జామ్ లో రాష్ట్రస్థాయిలో గోల్డ్ మెడల్ ర్యాంకు సాధించిన బోనాల ఆధ్య, ను అభినందించిన పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ ఐపీఎస్ మేడమ్ గారు
గ్యాస్ ధరలను తగ్గించాలని గొట్టిప‌ర్తిలో మహిళల నిర‌స‌న‌
జీవో 21 రద్దు చేయాలని జేఎన్టీయూ అధ్యాపకుల విధుల బహిష్కరణ
తీవ్ర విషాదం.. విమానం ల్యాండ్‌ అవ్వగానే గుండెపోటుతో పైలట్‌ మృతి
సాయుధ పోరాట యోధుడు సింగిరెడ్డి భూపతి రెడ్డి కూతురు మృతి
హార్రర్ సినిమా షూటింగ్‌లో రష్మిక మందన్నా.. ఇంతకీ లొకేషన్‌ ఎక్కడో..?